YS Sharmila: రేవంత్ రెడ్డి దొంగ.. కుట్ర చేసింది అతనే.. షర్మిల సంచలన వాఖ్యలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై షర్మిల మరో సారి సంచలన వాఖ్యలు చేశారు. పదవి పోతుందన్న భయంతోనే తనను అడ్డుకున్నాడంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టినప్పుడు సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.

New Update
YS Sharmila: రేవంత్ రెడ్డి దొంగ.. కుట్ర చేసింది అతనే.. షర్మిల సంచలన వాఖ్యలు

రేవంత్‌రెడ్డిపై (Revanth Reddy) వైఎస్‌ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ దొంగ అని సుప్రీంకోర్టే (Supreme Court) చెప్పిందని గుర్తు చేశారు. దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదన్నారు. తాను కాంగ్రెస్‌లో విలీనం కాకుండా కుట్ర చేసింది కూడా వాళ్లేనన్నారు. నేను వెళితే కొద్దిమందికి పదవి గండమని.. అందుకే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ రోజు షర్మిల మీడియాతో మాట్లాడారు. పదవి ఎక్కడ పోతుందోనని రేవంత్‌ భయపడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డిని రేటెంతరెడ్డి తాను అనలేదని.. సీట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ వాళ్లే విమర్శించారన్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై (Sajjala Ramakrishnareddy) సైతం షర్మిల సంచలన వాఖ్యలు చేశారు. తాను తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు సజ్జల సంబంధం లేదని అన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఆయన మళ్లీ ఇప్పుడు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. మళ్లీ సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ రోడ్లు, ఏపీలో సింగిల్ రోడ్లు అన్నప్పుడు సజ్జల మాట్లాడితే బాగుండేదన్నారు. సజ్జలకు అయినా.. జగన్‌కైనా ఒకటే సమాధానమని అన్నారు షర్మిల.
ఇది కూడా చదవండి: Telangana: బీఆర్ఎస్‌ ‘దళిత బంధు’కు కౌంటర్‌గా బీజేపీ కొత్త పథకం ఇదే.. పెద్ద ప్లానే

కుక్కతోక తగిలితే కూలిపోయేలా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) డిజైన్ చేశారని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YS Sharmila) తెలిపారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి (YS Rajashekhar Reddy) బతికి ఉన్న రోజుల్లోనే అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. రూ.38 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారని చెప్పారు. మొత్తం 16.48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ జరిగిందన్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రూ. 7 వేల కోట్లను ఖర్చు చేశారన్నారు. అయితే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా రీడిజైన్ చేశారన్నారు. నా మెదడు, నా రక్తం, నాశ్రమతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశానని ఆ సమయంలో కేసీఆర్ చెప్పినట్లు గుర్తు చేశారు. తీరా ప్రాజెక్టు ఇప్పుడు చూస్తే కుక్క తోక తగిలినా కూలిపోయే మాదిరిగా ఉందని ధ్వజమెత్తారు. గతేడాది అన్నారం, కన్నేపల్లి పంప్ హౌజ్ లు మునిగిపోయాయన్నారు. ఇందుకు కారణం కనీసం ఎత్తు కూడా చూసుకోకుండా పంప్ హౌజ్ లను నిర్మించడమేనని ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు