/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ycp-list-jpg.webp)
Ap Politics : ఏపీలో ఎన్నికలు(Ap Elections) సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ(YCP) తన 11 వ జాబితా ను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానానికి ఇన్ ఛార్జ్ లను వైసీపీ ప్రకటించింది.
కర్నూలు(Kurnool) పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ చార్జీగా రాజోలు ఎమ్మెల్యే, జనసేన నేత రాపాక వరప్రసాద్(Rapaka Vara Prasad) ను నియమించింది. అలాగే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును సీఎం జగన్ ఎంపిక చేశారు.
సీఎం @ysjagan గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా బీవై. రామయ్య..అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్....రాజోలు అసెంబ్లీ సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావును నియమిస్తూ లేఖను విడుదల చేసింది.… pic.twitter.com/CbwE3X1CeE
— YSR Congress Party (@YSRCParty) March 8, 2024
ముందు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జీగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను వైసీపీ నియమించింది. అయితే ఆలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానంటూ గుమ్మనూరు(Gummanuru) పట్టుబట్టడంతో వైసీపీ దానికి నో అని చెప్పింది. దీంతో జయరాం పార్టీని విడిచిపెట్టారు. ఆయన టీడీపీ(TDP) లో చేరి గుంతకల్లు నుంచి పోటీలో నిలిచేందుకు సిద్దంగా ఉన్నారు.
దీంతో ఆయన స్థానంలో బీవై రామయ్యను కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జీగా వైసీపీ ఎంపిక చేసింది. కొద్ది రోజుల క్రితమే పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు జగన్ అవకాశం ఇచ్చారు. రాజోలు అసెంబ్లీ ఇన్ ఛార్జీగా గొల్లపల్లిని వైసీపీ నియమించింది. రాపాకను మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు ఇచ్చారు.
Also Read : అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు బైకులు ఢీ.. నలుగురు మృతి