MLA Rapaka : రాజోలు సీటు విషయంపై జగన్ పునరాలోచించాలి: ఎమ్మెల్యే రాపాక
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు వైసీపీ సీటు విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పునరాలోచించాలని పేర్కొన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇవ్వడంతో పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కామెంట్స్ చేశారు.