YCP Bus Yatra: బస్సు యాత్రకు రెడీ అయిన వైసీపీ!

ఏపీలో రాజకీయాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. అనునిత్యం జనాల్లో ఉండేందుకు అన్ని పార్టీలు ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.

New Update
YCP Bus Yatra: బస్సు యాత్రకు రెడీ అయిన వైసీపీ!

100రోజుల పాటు బస్సు యాత్ర..

ఎన్నికలకు మరో 8 నెలలే ఉండటంతో ఏపీలో రాజకీయాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. అనునిత్యం జనాల్లో ఉండేందుకు అన్ని పార్టీలు ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలందరూ వంద రోజుల పాటు ప్రజల్లోనే ఉండేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షులు, నూతన కార్యవర్గాలను ఎంపికచేసే పనిలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే బస్సు యాత్ర నిర్వహించాలని డిసైడ్ అయింది.

బస్సు యాత్రలో ఐప్యాక్ టీం..

జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో కార్యవర్గ సభ్యులతో ఈ బస్సు యాత్ర చేపట్టనుంది. నిత్యం ప్రజల్లో పార్టీ కార్యక్రమాలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. మండలాల పరిధిలో ఏయే గ్రామాల మీదుగా సాగాలన్న దానిపై రోడ్‌ మ్యాప్‌ ఇవ్వనుంది. యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. నేతలతో పాటు ఐప్యాక్‌ టీం సభ్యులు కూడా ఆయా మండలాల్లోని పరిస్థితుల్ని విశ్లేషించనున్నారు. అనంతరం అధిష్టానానికి ఓ నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదిక ఆధారంగా ఆ మండలంలో పార్టీ పనితీరు ఎలా ఉంది.. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఎలా రూపుమాపాలనే దానిపై చర్యలు తీసుకోనుంది.

వై ఏపీ నీడ్స్ జగన్..

అలాగే ఇప్పటికే "వై ఏపీ నీడ్స్ జగన్" పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బస్సు యాత్ర చేపట్టడానికి రెడీ అయింది. ఈ రెండు కార్యక్రమాలు పూర్తయ్యేలోగా మరో కార్యక్రమాన్ని చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తోంది. సెప్టెంబరు నుంచి నవంబరు వరకూ వివిధ కార్యక్రమాలతో ప్రజల మధ్యే ఉండేలా ప్రణాళిక రూపొందిస్తోంది. అంతేకాకుండా జగనన్న సురక్ష కార్యక్రమం మరోసారి నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా ఎన్నికల కోడ్ వరకు చేయడంపైనా దృష్టి పెట్టింది. మొత్తానికి వివిధ కార్యక్రమాలతో జనాల్లోనే ఉండేలా సిద్ధమైంది.

ఓట్ల తొలగింపుపై సీఈసీకి ఫిర్యాదు..

ఓట్ల తొలగింపునకు సంబంధించి ఢిల్లీలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని వైసీపీ నిర్ణయించుకుంది. విజయ్ సాయిరెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం సీఈసీని కలవనుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని ప్రైవేటు సంస్థలతో కలిసి ఓటర్స్ లిస్టులో అవకతవకలకు పాల్పడ్డారని ప్రజల డేటా మొత్తం వాళ్ల హస్తాల్లో పెట్టుకుని ఓట్ల గల్లంతు కార్యక్రమాన్ని చేపట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబుకి ఏదో ఒక రాజకీయం కావాలని… అందుకే ఓట్ల తొలగింపు అంటూ ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సేవా మిత్రులంటూ కొంతమందిని తీసుకుని వారి చేత ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని గతంలో చంద్రబాబు చేశారని ఆరోపిస్తున్నారు. దొంగే దొంగ అన్నట్టుగా ఇప్పుడు ఓట్ల గల్లంతంటూ ఢిల్లీ వెళ్లి డ్రామా రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు