AP Elections 2024: పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ.. మంత్రి అంబటితో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితేంటి?

పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ తారా స్థాయికి చేరింది. అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఇతర నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఈ సమస్యను హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందన్న అంశంపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

New Update
AP Elections 2024: పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ.. మంత్రి అంబటితో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితేంటి?

పల్నాడు వైసీపీలో (YSRCP) వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే, నియోజకర్గంలోని ఇతర ముఖ్య నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లిలో అసంతృప్తి గళాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి వద్దంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. మొన్న గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీరుపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీరుపై నేతలు బహిరంగంగానే ఆగ్రహం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Breaking: విశాఖలో వైసీపీకి మరో షాక్..బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీనామా ?

ఏకంగా సీఎంఓ దగ్గర గోపిరెడ్డి వద్దంటూ ఆందోళన చేశారు. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు వరకూ చేరింది. తాజాగా మంత్రి అంబటి రాంబాబుకు కూడా అసమ్మతి సెగ తాకింది. మంత్రి రాంబాబు మాకు వద్దంటూ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరకు నేతలు వెళ్లారు. దీంతో రెండ్రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని విజయసాయిరెడ్డి వారికి హామీ ఇచ్చారు. స్థానికులకే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

జగన్ సర్వేలో కూడా మంత్రి అంబటి వెనుకబడ్డరన్న ప్రచారం కూడా సాగుతోంది. వరుసగా ఎమ్మెల్యేలపై క్యాడర్ అసంతృప్తి నేపథ్యంలో హైకమాండ్ సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డిని ఈ రోజు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కలవనున్నట్లు తెలుస్తోంది. కాసు మహేష్‌ రెడ్డిపై ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు