CM Jagan: దోచుకోవడానికే వారికి అధికారం.. రానున్నది కురుక్షేత్రమే: సీఎం జగన్

వచ్చే ఎన్నికల్లో  కురుక్షేత్ర యుద్ధం జరుగబోతోందన్నారు సీఎం జగన్.పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. దోచుకోవడానికీ, పంచుకోవడానికీ, తినడానికే ప్రతిపక్షాలకు అధికారం కావాలని జగన్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులను ఏపీ సీఎం జగన్‌ విడుదల చేశారు. విజయవాడలోని విద్యాధరపురం RTC డిపో దగ్గర్లో ఉన్న మినీ స్టేడియంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఆనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

New Update
CM Jagan: దోచుకోవడానికే వారికి అధికారం.. రానున్నది కురుక్షేత్రమే: సీఎం జగన్

CM Jagan: వచ్చే ఎన్నికల్లో  కురుక్షేత్ర యుద్ధం జరుగబోతోందన్నారు సీఎం జగన్..ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలు, మోసాలు నమ్మొదన్న జగన్.. పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. తనకు వేసే ప్రతీ ఓటూ పెదవాళ్లను కాపాడుకోవడం కోసం కోసమే అన్న జగన్.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ఈ విషయాల్ని రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినడానికే ప్రతిపక్షాలకు అధికారం కావాలన్న జగన్.. అది తన విధానం కాదన్నారు. తాను దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని అన్నారు.

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులను ఏపీ సీఎం జగన్‌ విడుదల చేశారు. విజయవాడలోని విద్యాధరపురం RTC డిపో దగ్గర్లో ఉన్న మినీ స్టేడియంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఆనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. దాదాపు 2,75,931 మంది లబ్దిదారులకు, ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున మొత్తం రూ.275.93 కోట్లను విడుదల చేశారని తెలిపారు. ఈ డబ్బు..  లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతోందని.. ఐదేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేయడం చాలా గర్వంగా ఉందని జగన్ అన్నారు. ప్రతి విడతలో లబ్దిదారులు.. ఈ డబ్బును సద్వినియోగం చేసుకుంటూ.. రోజూ లక్షల మందికి సేవలు అందిస్తున్నారని మెచ్చుకున్నారు. బండికి ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోమని సీఎం జగన్ సూచించారు.

పేదలకు ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, ఇంటికే బర్త్ సర్టిఫికెట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ ఇలా ఏ అవసరాలనైనా నేరుగా ఇంటి దగ్గరకే వచ్చేలా చేస్తున్నామని ఆయన అన్నారు. నవరత్న పథకాల ప్రయోజనాలన్నీ ఇంటి దగ్గరకే వచ్చేలా చేస్తున్నామని  సీఎం తెలిపారు. వాలంటీర్ల ద్వారా లంచాలు లేని పరిపాలన తెచ్చామన్నారు. తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలు చెప్పిన సమస్యలకు పరిష్కారంగా పథకాలన్నీ అమలు చేస్తున్నారమని జగన్ తెలిపారు. ఇలా మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం పూర్చి చేశామని జగన్ తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల సమయంలోనే హామీలు తెచ్చి... వాటిలో 10 శాతం కూడా పూర్తి చెయ్యట్లేదని సీఎం జగన్ అన్నారు.

Advertisment
తాజా కథనాలు