YCP : వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదో జాబితాను విడదల చేసింది. 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేస్తూ బొత్స సత్యనారాయణ ఈ జాబితాను ప్రకటించారు. కాకినాడ (ఎంపీ)- చలమలశెట్టి సునీల్. నర్సరావుపేట(ఎంపీ)-అనిల్‌కుమార్ యాదవ్. తిరుపతి (ఎంపీ)-గురుమూర్తి. మచిలీపట్నం (ఎంపీ)- సింహాద్రి రమేష్ బాబు. సత్యవేడు (ఎమ్మెల్యే) - నూకతోటి రాజేష్. అరకు వేలి (ఎమ్మెల్యే)- రేగం మత్స్యలింగం. అవనిగడ్డ (అసెంబ్లీ) - డా.సింహాద్రి చంద్రశేఖరరావు పేర్లను ప్రకటించారు.
అభ్యర్థులకు మొండిచేయి..
ఐదో లిస్టులో పలువురు అభ్యర్థులకు మొండిచేయి చూపించగా.. కాకినాడ సిట్టింగ్ ఎంపీకి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా చనమల శెట్టి సునీల్ నిలబడనున్నారు. మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి జనసేనలో చేరడంతో కొత్తగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును నియమించారు. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేయడంతో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నియమించింది అధిష్టానం.
ఇది కూడా చదవండి: Gaddar Jayanthi Celebrations: నా మాటే శాసనం .. గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
పలు మార్పులు..
తిరుపతి ఎంపీగా గురుమూర్తిని మరోసారి నియామకమయ్యారు. అతన్ని గత లిస్టులో సత్యవేడు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించింది. అరకు ఎమ్మెల్యేగా ప్రకటించిన గతంలో గొట్టేటి మాధవిని ప్రకటించింది. ఇప్పుడు రేగం మత్య్స లింగంకు అవకాశం కల్పించింది. అవనిగడ్డ సింహాద్రి రమేష్ ను ఎంపీగా పంపించడంతో ఆయన బంధువుకి సింహాద్రి చంద్రశేఖర్ నియామించారు. సత్యవేడు గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం కాదని తిరుపతి ఎంపీ గురుమూర్తిని ప్రకటించారు.ఈ లిస్టులో నూక తోటి రాజేష్ కు కూడా ఛాన్స్ ఇచ్చారు.