Vivekam Movie Trailer: 'గొడ్డలి కోసం దస్తగిరి కదిరి పోయినాడు'.. సంచలనం సృష్టిస్తోన్న YS వివేక బయోపిక్ ట్రైలర్!

మాజీ ఎంపీ వైఎస్ వివేకా బయోపిక్ గా వచ్చిన 'వివేకం' సినిమా టీజర్ ఏపీలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ట్రైలర్ చూస్తే.. సీఎం జగన్ టార్గెట్ గానే ఈ సినిమా తీసినట్లు అర్థమవుతుంది.

New Update
Vivekam Movie Trailer: 'గొడ్డలి కోసం దస్తగిరి కదిరి పోయినాడు'.. సంచలనం సృష్టిస్తోన్న YS వివేక బయోపిక్ ట్రైలర్!

YS Vivekananda Reddy Biopic Movie: ఏపీలో ఎన్నికల వేళ వరుసగా పొలిటికల్ సినిమాల హంగామా కనిపిస్తోంది. పొలిటికల్ మూవీస్ అంటేనే ఎవరో ఒకరిని ఉద్దేశించే ఉంటాయనేది కచ్చితంగా తెలిసిందే. ఇప్పటికే డైరెక్ట్ ఆర్జీవీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా వ్యూహం సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ పొలిటికల్ ఎంట్రీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంగా ఈ సినిమాను తెరెకెక్కించారు. ఈ సినిమాకి స్వీకెల్ గా శపథం సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఎన్నికల లోపే ఈ చిత్రం కూడా రిలీజ్ చేస్తారు. అయితే, తాజాగా రిలీజ్ చేసిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి బయోపిక్ 'వివేకం' సినిమా టీజర్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Also Read: అల్లు అర్జున్‌ బర్త్‌ డే ట్రీట్‌.. ఫ్యాన్స్‌ కు అదిరిపోయే న్యూస్‌!

2019లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకా హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఎంత పెను ప్రకంపనలు రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హత్య జరిగి ఐదేళ్లు కావోస్తున్న ఇప్పటికి వైఎస్ వివేకా హత్య కేసు ఓ కొలిక్కి రాలేదు. వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇప్పటికీ తన తండ్రి చావుకు కారణమైన వారికి శిక్ష పడాలని పోరాడుతూనే ఉన్నారు. అంతేకాదు..సీఎం జగన్ కు కూడా ఇందులో ప్రమేయం ఉందని పలుమార్లు ఆరోపణలు కూడా చేశారు. రాజకీయ కోణంలోనే హత్య చేశారని వార్తలు కూడా వినిపించాయి.

vivekaAlso Read: పరిటాల శ్రీరామ్‌ సీటుపై కొనసాగుతున్న సస్పెన్స్.. ధర్మవరం టికెట్ పై తీవ్ర ఉత్కంఠ..!

అయితే, వివేకా బయోపిక్ గా వివేకాం సినిమా తీశారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వివేకా హత్య కేసుపై CBI చార్జిషీట్‌, దస్తగిరి సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారం ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. వైఎస్‌ వివేకా రాజకీయం, కుటుంబ నేపథ్యం, ఆయన హత్యకు ముందు వెనుక జరిగిన పరిణామాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్‌లో చూపించారు.

AP CM Jagan

త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 22న www.vivekabiopic.comలో చూడొచ్చని ట్రైలర్‌లో మూవీ యూనిట్ పేర్కొన్నారు. ట్రైలర్ మాత్రం సీఎం జగన్ ను టార్గెట్ గా చేసుకుని తీసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ప్రతిపక్ష్యాలకు ఎన్నికల్లో ప్లస్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు