Sunitha: కడపలో మాజీ మంత్రి వైఎస్ సునీత ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయిన వారం జగనన్న మీద దాడి జరిగిందని..రాయి విసిరిన పిల్లవాడి మీద హత్యాయత్నం కేసు పెట్టారని..నాన్ బెయిలబుల్ వారెంట్ కింద జైల్లో ఉంచారని అన్నారు.
Also Read: చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. బీజేపీలోకి కీలక నేత?
అయితే, పులివెందులలోని మురారి చింతల గ్రామంలో వృద్ధ దంపతులపై కొందరు దాడి చేశారని.. కానీ, ఈ ఘటనపై బేల్ బుల్ కేసు పెట్టారని పేర్కొన్నారు. కొట్టిన వారు గ్రామంలో దర్జాగా తిరుగుతున్నారని.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. మురాలచింతల ఘటనను బయట పెట్టగానే అవినాష్ రెడ్డికి, వైసీపీ పార్టీకి భయం పట్టుకుందన్నారు. అన్యాయం జరుగుతుందని చెబుతున్నాం కాబట్టే వారు భయపడుతున్నారని కామెంట్స్ చేశారు.
Also Read: అభ్యర్థి మార్పుపై భగ్గుమంటున్న తెలుగు తమ్మళ్ళు
వైసీపీ వారు ఎక్కడెక్కడ గొడవ చేస్తున్నారో ధైర్యంగా బయట పెట్టండన్నారు. న్యాయం జరగాలంటే పోరాడే శక్తి ఉండాలన్నారు. వివేకానంద రెడ్డికి అన్యాయం జరిగిందనే పోరాడుతున్నానని .. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండ ఉండాలనే ఇలా చేస్తున్నానన్నారు. ఎలక్షన్లలో పోటీ చేసే వారికి కొన్ని రూల్స్ ఉన్నాయని.. అయితే, ఎన్నికల నిబంధనలను అవినాష్, వైసీపీ పార్టీ వారు పాటించడం లేదని విమర్శలు గుప్పించారు. ప్రజలను తమ ఓటు న్యాయం కోసం.. ధర్మం కోసం వేయండని పిలుపునిచ్చారు. వైయస్ షర్మిలను ఎంపీగా, ఎమ్మెల్యేగా అభ్యర్థి ధ్రువకుమారును గెలిపించండని కోరారు.