YS Sunitha : జగన్ కు వివేకా కూతురు సునీత సంచలన సవాల్.. ఆ ఛానల్ లో చర్చకు సిద్ధం..!

ఏపీ సర్కార్ పై వైఎస్ సునీత సంచలన కామెంట్స్ చేశారు. వివేకాను ఎవరు మర్డర్ చేశారో సీఎం జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ అవినాష్ ను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. వివేకా మర్డర్ పై జగన్ ఛానల్ లో తాను ఓపెన్ డిబేట్ కి సిద్ధమని సవాల్ చేశారు.

New Update
Sunitha: వైసీపీకి భయం పట్టుకుంది.. న్యాయం కోసం.. ధర్మం కోసం ఓటేయ్యండి..!

YS Sunitha v/s YS Jagan : జగన్ సర్కార్(Jagan Sarkar) పై మాజీ మంత్రి వివేకా కుమార్తె వైఎస్ సునీత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాన్న మర్డర్(Murder) తర్వాత తనను ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మి.. మీరు చెప్పినట్లు మాట్లాడానని అయితే తన తప్పు సరిదిద్దుకునే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎవరినయినా ఒక్కసారే మాత్రమే మోసం చేయగలరని చెప్పుకొచ్చారు. ప్రజలు విజ్ఞులని వారి పిల్లల భవిష్యత్ కోసం తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

ఓపెన్ డిబేట్ కి సిద్ధం

వివేకా(Viveka) మర్డర్ లో  తనకు అన్నగా సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. సీఎంగా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. వివేకాను ఎవరు మర్డర్ చేశారో సీఎం జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు. జగన్ అవినాష్ ను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. అవినాష్ నోరు విప్పితే కీలక విషయాలు బయటికి వస్తాయని జగన్ కు భయం పట్టుకుందన్నారు. వివేకా మర్డర్ పై జగన్ ఛానల్ లో ఓపెన్ డిబేట్ కి తాను సిద్ధమని సవాల్ విసిరారు.

Also Read : కొంపముంచిన రూ. 500 నోటు, 50 వేలు పొగొట్టుకున్నాడుగా..!

వాడుకొని వదిలేశారు..

వైఎప్ షర్మిల(YS Sharmila) గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ కోసం ఎంతో శ్రమించిందని.. జగన్ జైలులో ఉన్నప్పుడు మరో ప్రస్థానం పేరుతో ఎండనక..వాననక పిల్లలను ఇంట్లో వదిలేసి మీ కోసం, మీ పార్టీ కోసం పని చేసిందని గుర్తు చేశారు. మీ కోసం పనిచేసిన షర్మిలను వాడుకొని వదిలేసింది నిజం కాదా అని ఫైర్ అయ్యారు. షర్మిలకు సపోర్ట్ గా ఉన్న వివేకాను హత మార్చారని ఆరోపించారు.

మా గోల్ ఇదే..

షర్మిల తనకు చెల్లి అని తమ ఇద్దరి ఆశయం ఒక్కటేనని చెప్పుకొచ్చారు. తమ గోల్ అవినాష్, జగన్ ఓడిపోవాలి.. వైసీపీ ప్రభుత్వం గద్దె దింపాలని స్పష్టం చేశారు. నేరస్థులు చట్ట సభల్లో ఉండకూడదని పేర్కొన్నారు. తాను ప్రశ్నించిన ప్రశ్నలకు సీఎం జగన్(CM Jagan) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు వివేకా హత్యను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. హత్య రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు