YS Sunitha: వివేకా హత్య కేసులో ఇలా జరగకుంటే బాగుండేది: సునీత

వివేకా హత్య కేసులో రాజకీయ జోక్యం లేకుంటే బాగుండేదన్నారు డాక్టర్. వైఎస్ సునీత. అందువల్లే కేసులో పురోగతి లేదన్నారు. వివేకా హత్యపై అయిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నానని చెప్పారు. హంతకులకు కాకుండా పోరాటం చేసే వారికి ఓటెయ్యాలన్నారు.

New Update
Sunitha: వైసీపీకి భయం పట్టుకుంది.. న్యాయం కోసం.. ధర్మం కోసం ఓటేయ్యండి..!

YS Sunitha: ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి వివేకా కుమార్తే సునీత స్పందించారు. USA నుంచి వచ్చి స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న తనకు ఈర్ష్య పడే అవసరం లేదన్నారు. వివేకా హత్య కేసులో రాజకీయ జోక్యం జరగకుంటే బాగుండేదన్నారు. వివేకా హత్యపై అయిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నానన్నారు.

రాజకీయ జోక్యం వల్లే..

దస్తగిరి అప్రూవర్ అయినంత మాత్రాన తప్పించుకోలేడన్నారు. అప్రూవర్ అనేది కోర్టు, పోలీసులకు సంబందించిన అంశమని..విచారణకు తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ జోక్యం వల్లే కేసులో పురోగతి లేదన్నారు. తాను.. రాధాకృష్ణ, చంద్రబాబు మాటవిని మాట్లాడుతున్నా అని ఆరోపించారని .. అయితే, అప్పట్లో సజ్జల చెప్పమంటే చెప్పానని అన్నారు. ఎవరిని కలిసినా దానికి కారణాలు వెతకడం.. రాజకీయాల కోసం అని చెప్పడం సరికాదన్నారు.

ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదు..

వివేకాను అతికిరాతకంగా చంపేశారని..వివేకా చనిపోతే ఏరోజైనా ఏమైందని అడిగారా అని ప్రశ్నించారు. గూగుల్ టేక్ ఓవర్ ఫేక్ అని ఎలా చెబుతారని..సీబీఐ సర్వే అఫ్ ఇండియా ఫాబ్రీకేట్ చేశారా? అని నిలదీశారు. అవినాష్ ఎక్కడెక్కడ ఉన్నారో గూగుల్ టేక్ ఓవర్ క్లారిటీ గా చెప్పగలుగుతోందన్నారు. అవినాష్ ఫోన్ ఎందుకు సీబీఐకి ఇవ్వడం లేదని నిలదీశారు. ఫోన్ ఇస్తే కడిగిన ముత్యంలా బయటపడతారన్నారు.

Also Read: మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత.. హనుమాన్‌ భక్తులు ఆందోళన..!

జగన్ కు ఏం చెప్పారు..

శివ ప్రకాష్ రెడ్డి నుంచి అవినాష్ కు 6.26 నిముషాలకు ఫోన్ పోయిందని.. గజ్జల ఉమా శంకర్ రెడ్డి అవినాష్ ఇంట్లో ఉన్నాడని..దారిలో ఉంటే 47సెకండ్లలో ఇంటికి ఎలా చేరుకుంటారని ప్రశ్నించారు. జగన్ కు ఏమని చెప్పారు.. హార్ట్ ఆటాక్ అని చెప్పారా.. హత్య అని చెప్పారా? అని అడిగారు. చిన్నాన హత్య జరిగితే ఎందుకు డీజీపీకి ఫోన్ చేయలేదు? అని నిలదీశారు.

కాకమ్మ కబుర్లు..

ఆధారాలు లేకుండా కాకమ్మ కబుర్లు చెబితే ప్రయోజనం లేదన్నారు. జగన్ డిసైడ్ చేసింది కాదనలేక ఎంపీ అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకా కృషి చేశారన్నారు. మీ కోసం అంత కష్టపడిన వివేకా కోసం ఏమి చేశారు..విచారణ జాప్యంపై ఎందుకు అడగలేదు.. మీ కోసం కష్టపడ్డ మనిషి కోసం ఎందుకు విచారణపై ప్రశ్నించలేదు..వివేకా చనిపోయాక ఆయన గురించి తప్పుడు నీచ రాతలు రాసారు..చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడుతారా..అంతగా మీకోసం పోరాడిన వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడం మీ బాధ్యత కాదా అని నిప్పులు చెరిగారు.

షర్మిల గుర్తుకు రాలేదా..

బిడ్డలను ఇంటిని వదిలి జగన్ అన్న కోసం షర్మిల పాదయాత్ర చేశారు..అంత కష్ట పడ్డ షర్మిల మీకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. భారతి బంధుత్వం ఉందనే అవినాష్ కు ఎంపీగా సీట్ ఇచ్చారన్నారు. ప్రజలకు ఏమి చేశారని అవినాష్ కు సీట్ ఇచ్చారు. హంతకులకు కాకుండా పోరాటం చేసే వారికీ ఓటెయ్యండని వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు