YS Sunitha: సీఎం జగన్‌కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందన్నారు వైఎస్ వివేకా కుమార్తె సునీత. త్వరగా బ్యాండేజ్ తీయాలని జగన్ కు ఒక డాక్టర్‌గా సలహా ఇస్తున్నట్టు చెప్పారు. గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందన్నారు. నామినేషన్ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సునీత స్పందించారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
Also Read: ఎమ్మెల్యే కాకణి వృత్తి మారలేదు.. బుద్ది మారలేదు.. సోమిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
నేడు జగన్ చేసిన వ్యాఖ్యల్లో వివేకాపై ద్వేషం కనిపిస్తోందన్నారు. ఏం పాపం చేశారని ఆయనపై మీకు ఇంత ద్వేషమని జగన్ ను ప్రశ్నించారు. మీ కోసం త్యాగం చేశారు కాబట్టే.. వివేకాపై కోపమా? సీఎం జగన్‌కు న్యాయవ్యవస్థ, సీబీఐపై నమ్మకం లేదని.. ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలని అన్నారు. హత్యపై మాట్లాడవద్దంటూ కోర్టు ఆర్డర్ తెచ్చిన వాళ్లే మాట్లాడుతున్నారన్నారు. సీబీఐ నిందితులు అని చెప్పిన వాళ్లకు ఓట్లు వేయవద్దని కోరారు. తప్పు చేసి ఉంటే తనకైనా, తన భర్తకైనా శిక్ష పడాల్సిందేనన్నారు.
Also Read: ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పవన్.. కొణిదెల ఫ్యామిలీ నుంచి అకీరా-ఆద్యలు ఔట్!
అవినాష్‌రెడ్డి చిన్న పిల్లోడని చెబుతున్నారని..మరీ, ఎంపీ పదవులు పిల్లలకు ఇస్తారా? అని ప్రశ్నించారు. సీబీఐ నిందితులు అన్న వాళ్లను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఐదేళ్లుగా తన తండ్రి హత్యపై పోరాడుతుంటే రాజకీయాలు అంటగడుతున్నారని విమర్శలు గుప్పించారు. సీఎంను ప్రాధేయపడుతున్నానని.. ఇప్పటికైనా తన పోరాటానికి సహాయం చేయండని విజ్ఞప్తి చేశారు.