YS Sunitha : కడప జిల్లాలో వైఎస్ సునీత ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కొద్ది కాలంలో అందరినీ కలవలేకపోయా.. క్షమించి ఇది నా ప్రత్యేక అభ్యర్ధనగా భావించండి అని కోరారు. నాతో మొదలైన ఆవేదన, న్యాయ పోరాటం.. మీ నేత వైఎస్ వివేకాకు న్యాయం జరిగేలా తీర్పు ఇవ్వాలని సునీత విజ్ఞప్తి చేశారు. ఈ మూడు నెలల్లో చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. కొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోవాలని భావిస్తునన్నాని ఆమె అన్నారు. అందరూ ఓటు వేయడానికి వెళ్ళాలి.. మీరంతా న్యాయం వైపు నిలవాలని ఆశిస్తున్నానని సునీత అన్నారు. పార్టీలకు అతీతంగా న్యాయానికి ఓటు వేస్తారని, న్యాయ పోరాటాన్ని దేశమంతా ఎదురు చూస్తుందన్నారు.
న్యాయం వైపు నిలవాలి.. న్యాయం గెలవాలి:
న్యాయ పోరాటంలో వైఎస్ విజయమ్మ నిలబడ్డారు. అందుకే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. న్యాయం కోసమే విజయమ్మ పోరాటం.. ఇది అంత సులభతరం కాదన్నారు. మన తన తారతమ్య భేదం లేకుండా వున్నప్పుడే సమాజంలో విలువలు పెరుగుతాయని సునీత అన్నారు. మన రాష్టం జిల్లా బాగుపడాలంటే న్యాయం గెలవాలి. తప్పు జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించేతత్వం ఉండాలి. సీఎంగా న్యాయం ధర్మం వైపు ఉండాల్సిన జగన్ ఎందుకు అవినాష్ వైపు నిలిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హత్య నేరంలో నిందితుడైనా అవినాష్‌కు మద్దతు పలకడం ఏమిటీ..? దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. పులివెందుల ప్రజలు ఓటు వేసుకునే స్వేచ్చాయిత వాతావరణం కల్పించాలి. వివేకాకు జరిగిన అన్యాయం కాదు మనకు కూడా జరిగే పరిస్థితి ఉందని వైఎస్ సునీత పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: వేసవిలో పిస్తా తింటే ఏం అవుతుందో తెలుసా?