వైఎస్ షర్మిల ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు..!

వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వైఎస్ రాజా రెడ్డి త్వరలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో తనతో పాటు చదువుకున్న ప్రియా అట్లూరిని ప్రేమించాడని, నాలుగేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని సమాచారం.

వైఎస్ షర్మిల ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు..!
New Update

YS Sharmila’s son marriage rumours: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వైఎస్ షర్మిల- అనిల్ కుమార్ దంపతుల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి (YS Raja Reddy). అమెరికాలోని డల్లాస్ లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న అతను హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. అయితే, రాజా రెడ్డి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయని సమాచారం.

Also read: ఈ వయసులో హనీమూన్ ఏంట్రా బాబు.!

అమెరికాలో తనతో పాటు చదువుకున్న అమ్మాయిని ప్రేమించాడని, నాలుగేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఆ అమ్మాయి పేరు ప్రియ అట్లూరి అని, ఆమె కమ్మ సామాజికవర్గానికి చెందినదని చెపుతున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ దేశ పౌరసత్వం కూడా ఆమెకు ఉంది.  ఉన్నత చదువుల కోసం రాజా రెడ్డి.. అమెరికాకు వెళ్లినప్పుడు ప్రియా అట్లూరి పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. నాలుగేళ్లుగా వారు ప్రేమించుకుంటోన్నారని ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Also Read: ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. ఇండియా కూటమి పరిస్థితి ఏమిటి?

వీరి ప్రేమకు అటు వైఎస్ షర్మిల- అనిల్ కుమార్ దంపతులు, ఇటు ప్రియ అట్లూరి కుటుంబ సభ్యులు ఓకే చెప్పాయని.. వచ్చే ఏడాది మే లో వీరి వివాహం జరగబోతోందని సమాచారం. రాజారెడ్డి, ప్రియకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియ చూడ్డానికి చాలా అందంగా, హీరోయిన్ లా ఉందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే వీరి పెళ్లిపై షర్మిల ఇంకా స్పందించాల్సి ఉంది.

#ys-sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe