YS Sharmila to Meet YS Jagan: ఏపీలో రాజకీయాల్లో బుధవారం నాడు ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకోనుంది. వైఎస్ షర్మిల రేపు విజయవాడకు వెళ్తున్నారు. సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్‌ను ఆహ్వానించనున్నారు వైఎస్ షర్మిల. వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం షర్మిల నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. జనవరి 18వ తేదీన రాజారెడ్డి - ప్రియా అట్లూరిల నిశ్చితార్థం జరుగనుంది. ఫిబ్రవరి 17న వివాహం జరుగనుంది. కాగా, జగన్‌తో భేటీ సందర్భంగా రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. వైఎస్ షర్మిలను, విజయమ్మను వైవీ సుబ్బారెడ్డి కలిసినట్లు వార్తలు వచ్చాయి. వైసీపీలో కీలక నేత, వైఎస్ఆర్ బంధువైన వైవీ సుబ్బారెడ్డి.. షర్మిలను కలవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జగన్ తరఫున షర్మిలకు రాయబారం తీసుకెళ్లారని, సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారనే టాక్ వచ్చింది. అయితే, ఈ వార్తలను సుబ్బారెడ్డి కొట్టిపడేశారు. జగన్ తరఫున తాను వైఎస్ షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. నెల రోజుల తరువాత విజయమ్మను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లానన్నారు. కుటుంబ సభ్యులను కూడా కలవకూడదా? అని ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారాయన. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగిందని గుర్తు చేశారు.
Also Read:
హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు.. ఇదిగో వీడియోలు!