వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి షర్మిల(Sharmila) కాంగ్రెస్(Congress) పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జనవరి 3న ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సోనియా, రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో షర్మిల భేటీ అయి పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెకు కీలక పదవి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్టీలో చేరేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ షర్మిల చేరికకు పావులు కదిపినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పజెబుతారా.. లేదా రాజ్యసభ సీటు కేటాయిస్తారా అన్నది అధిష్టానం నేతలతో భేటీ తర్వాత తేలనుంది. అయితే షర్మిల ఒక్కరే కాంగ్రెస్ పార్టీలో చేరతారా..? లేదంటే ఆమె వెనుక మరికొందరు కీలక నేతలు వెళతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే పలువురు నేతలు షర్మిలకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది.
జనవరి 4న కాంగ్రెస్ కీలక సమావేశం
ఎలాగైనా సరే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధించే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు ఆయా రాష్ట్రాల్లో పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జనవరి 4న అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్నది. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా హాజరు కానున్నారు. వారికి ముందే అధిష్టానం డైరెక్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే షర్మిల కూడా కొన్ని డిమాండ్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మొదట స్టార్ క్యాంపెయినర్‌గా తీసుకుని తదనంతరం పార్టీలో కీలక స్థానం కల్పించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అయితే కాంగ్రెస్‌లో చేరితే వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీలోకి దిగుతారా.. అన్న చర్చ నడుస్తోంది. పోటీ చేస్తే ఆమె ఒక్కరే చేస్తారా... లేదా మరికొందరు కీలక నేతలు ఆమెతో పాటు పోటీకి దిగుతారా అన్నది తేలాల్సి వుంది.
ఏపీ కాంగ్రెస్‌లో ఉత్సాహం..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ఇన్నాళ్లూ చడీచప్పుడు లేకుండా ఉన్న నేతలు ప్రస్తుతం తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆమెను రాకను స్వాగతిస్తున్నామని ఆహ్వానం పలికారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల రాకను ఆహ్వానిస్తున్నారు. అలాగే ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా 10 నుంచి 15 శాతం ఓట్లు పెరిగే అవకాశముంది. అలాగే రెండు మూడు స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే వైసీపీపై అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు, టికెట్ దక్కని వారు, గతంలో కాంగ్రెస్‌ను వీడిన పలువురు నేతలు షర్మిల ద్వారా కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే వీటన్నింటిని ఎలా సమన్వయం చేసుకుని మరింత బలపడేందుకు ప్రయత్నిస్తారా అన్నది చూడాల్సి వుంది.
Also Read: జనవరి ఫస్ట్‌ని న్యూ ఇయర్‌గా ఎందుకు జరుపుకుంటున్నారు? అసలు న్యూ ఇయర్ ఆ రోజేనా?
WATCH: