YS Sharmila: మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఎంపీలుగా ఎవరెవరు పోటీ చేస్తారనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో (Congress Party) తన పార్టీని విలీనం చేసిన వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే షర్మిల కడప (Kadapa) నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆమె బంధువులు, అనుచరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బలమైన అభ్యర్థి షర్మిలానేనని ఆమె అనుచరులు చెబుతున్నారు.
Also Read: కేసీఆర్ ఒంట్లో మద్యం.. కేటీఆర్ ను బొక్కలో.. బండి సంజయ్ గరం
కాంగ్రెస్ నేతల మద్దతు కావాలి
మరోవైపు షర్మిల కడప నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా ఇదే అంశాన్ని సీనియర్ నేత, మాజీ మంత్రితో ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తతం పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల మద్దతు కూడగట్టుకునే పనిలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణల రాజకీయాల్లో ఎంట్రీ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల (YS Sharmila)... 2019లో ఏపీలో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశారు. 2020 వరకు ఆమె వైసీపీలో కొనసాగారు. అనంతరం అనుహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేశారు. తాను కూడా తెలంగాణ బిడ్డనే అంటూ 2021 జులై 8న వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించిన షర్మిల.. తాను కూడా పాలేరు నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఎవరూ ఊహించని విధంగా పోటీ నుంచి తప్పుకున్నారు.
కాంగ్రెస్‌లో విలీనం
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. హస్తం పార్టీకి మద్దతు ఇవ్వాలని తన పార్టీ శ్రేణులకు సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం షర్మిల చివరికి వైఎస్సార్‌టీపీని (YSRTP) కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీని కలిపేశారు.