YS Sharmila: ఆరోగ్యశ్రీ ఇక లేనట్టేనా?.. ఎన్డీయేపై షర్మిల ప్రశ్నల వర్షం

AP: ఆరోగ్యశ్రీపై కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే.. ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెబుతున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

YS Sharmila: ఆరోగ్యశ్రీ ఇక లేనట్టేనా?.. ఎన్డీయేపై షర్మిల ప్రశ్నల వర్షం
New Update

YS Sharmila: ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా ? అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా ? ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా ? అని నిలదీశారు.

షర్మిల ట్విట్టర్ (X)లో.. "అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా ? పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం ? ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా ? ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా ? గత YCP ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే..

ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయి. దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలి. ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన అద్భుత పథకం.పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకం. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకం. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించం. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు.


#sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe