/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/YS-SHARMILA-1-jpg.webp)
YS Sharmila: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై దాడి జరగడం బాధకరమన్నారు. జగన్ ఎడమ కంటిపై గాయం కావాటం దురదృష్టకరమన్నారు వైఎస్ షర్మిల. ప్రమాదవశాత్తు ఇలా జరిగి ఉండవచ్చని అనుకుంటున్నట్లు షర్మిల ట్వీట్ చేశారు. కావాలని ఎవరైనా ఇలా దాడికి యత్నించినట్లయితే ప్రతిఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందే అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న షర్మిల..హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే అన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.
ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం.అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను…
— YS Sharmila (@realyssharmila) April 13, 2024
ఇది కూడా చదవండి: మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు
Follow Us