YS Sharmila: భారతి చేయాలనుకున్న పాదయాత్రను నేను చేశానా?.. దమ్మంటే నిరూపించండి.. షర్మిల ఛాలెంజ్..!

తాను స్వార్థం కోసం పాదయాత్ర చేశానంటూ జైల్లో అధికారి చెప్పాడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. దమ్ముంటే అప్పటి జైలు అధికారితో ఈ విషయం చెప్పించగలరా ? అంటూ సవాల్ చేశారు. ఇది నిజమో కాదో అమ్మ విజయమ్మతో చెప్పించండి అని అన్నారు.

New Update
YS Sharmila: భారతి చేయాలనుకున్న పాదయాత్రను నేను చేశానా?.. దమ్మంటే నిరూపించండి.. షర్మిల ఛాలెంజ్..!

Also Read: వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ ఫైనల్‌ చేసిన అధిష్టానం! ఎవరెవరున్నారంటే..?

దమ్ముంటే నిరూపించండి

సీఎం జగన్ భార్య భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్రను నేను చేశానంటూ..నా స్వార్థం కోసమే పాదయాత్ర చేశానంటూ విచితంగ్రా మాట్లాడుతున్నారన్నారు. ఈ విషయం జైల్లో అధికారి చెప్పాడని అంటున్నారన్నారు. అయితే, దమ్ముంటే అప్పటి జైలు అధికారితో ఈ విషయం చెప్పించగలరా ? అని సవాల్ విసిరారు వైఎస్ షర్మిల. దేవుడు మీద ప్రమాణం చేయగలరా ? అంటూ ప్రశ్నించారు. ఆ రోజు ఏం జరిగిందో తాను ప్రమాణం చేసి చెప్పగలనని ధీమ వ్యక్తం చేశారు.

Also Read: టీడీపీ ఏకపక్షంగా అభ్యర్ధులను ప్రకటించడం సరికాదు.. పవన్ కళ్యాణ్ సీరియస్..!

నిస్వార్థంగా

నాకు నేనుగా ఎప్పుడు పాదయాత్ర చేయలేదని.. నన్ను అడిగితే తప్పా నేను పాదయాత్ర చేయలేదని వివరించారు. తాము అక్రమ సంపాదనకి స్కెచ్ వేశామని అంటున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క సారి మాత్రమే విజయమ్మతో వెళ్ళానని అన్నారు. తన భర్త అనిల్ ఒక్క రోజు కూడా జగన్ రెడ్డిని కలవలేదని వివరించారు. తప్పుడు నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా కోరుకున్నానని తెలిపారు. దమ్ముంటే ఇది నిజమో కాదో అమ్మ విజయమ్మ తో చెప్పించండి అంటూ ఛాలెంజ్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు