YS Sharmila: వైసీపీ సర్కార్ పై APCC చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్నింటిలో నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటికే వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు షర్మిల. తాజాగా, ఆడుదాం ఆంధ్ర అంటూ చేస్తున్న కార్యక్రమ తీరుపై నిప్పులు చెరిగారు. క్రీడలపై కూడా దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Also Read: లండన్‌లో కూతురుతో విరాట్ కోహ్లీ…వైరల్ అవుతున్న ఫోటో
సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు, ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను, అధికారమదాన్ని చూపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేమన్నారు.
ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్తంట్స్ చేయించిన వైసీపీ నేతలు, అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? ఇది ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంపై వెనువెంటనే నిస్పాక్షికమైన విచారణ జరగాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నదన్నారు. క్రీడలపై వైసీపీ క్రీనీడలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇంకెన్ని దిగజారుడు ఆటలు ఆడతారు వీళ్ళు? అని ఫైర్ అయ్యారు.
Also Read: సాయిపల్లవితో మరో సినిమా చేయను.. మెగా హీరో కామెంట్స్ వైరల్!
కాగా, దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్ర క్రికెట్ గురించే చర్చ నడుస్తోంది. ఇకపై ఆంధ్ర క్రికెట్‌కు ఆడనంటూ టీమిండియా టెస్టు ప్లేయర్, ఏపీ ఆటగాడు హనుమ విహారీ ప్రకటించడం సంచలనం రేపింది. ఈ రంజీ సీజన్ సమయంలో మధ్యప్రదేశ్‌పై మ్యాచ్ తర్వాత విహారీని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కె.ఎన్. పృథ్వీరాజ్ అనే ఆటగాడితో గొడవ కారణంగానే.. ఏసీఏ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇదే విషయాన్ని విహారీ సైతం స్పష్టం చేశాడు. అతనో రాజకీయ నేత కుమారుడని.. జట్టులో 17వ ఆటగాడంటూ విహారి చెప్పుకొచ్చాడు. కేవలం రాజకీయ ఒత్తిడిల వల్లే ఏసీఏ నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Watch This Video: