YS Sharmila: డేట్, టైమ్ మీరు చెప్పినా.. మమ్మల్ని చెప్పమన్నా ఓకే.. వైవీ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్

ఏపీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ శేణుల్లో కదలిక మొదలైంది.

New Update
YS Sharmila:  డేట్, టైమ్ మీరు చెప్పినా.. మమ్మల్ని చెప్పమన్నా ఓకే.. వైవీ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్

YS Sharmila: రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు ఏపీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలా రెడ్డి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తన తండ్రి పాదయాత్ర ముగింపు స్మారక చిహ్నాన్ని సందర్శించుకుని పర్యటన ప్రారంభించారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలోనూ పర్యటించనున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ శేణుల్లో కదలిక మొదలైంది.

శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. బస్సులో తోటి ప్రయాణికులతో ముఖాముఖి నిర్వహించారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా జిల్లా పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా బస్సులో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ను షర్మిల స్వీకరించారు. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడటానికి తాను సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

డేట్, టైమ్ మీరు చెప్పినా.. మమ్మల్ని చెప్పమన్నా సరే. ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించండి. నేను మీడియాను తీసుకొని వస్తా’ అని కామెంట్స్ చేశారు. రాజధాని లేకుండా నాలుగేళ్లు పాలించిన ఘనత వైసీపీదే అని విమర్శించారు. నాలుగేళ్ల పాలన చూసి జగన్‌ రెడ్డిని విమర్శిస్తుంటే.. వైసీపీ నేతలు ఫీలవుతున్నారని వ్యాఖ్యనించారు. ‘సరే జగన్ రెడ్డి అంటే మీకు ఇబ్బందిగా ఉంటే.. ఇక నుంచి జగనన్నా అని పిలుస్తా’ అని కౌంటర్ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు