Sharmila: అన్న వర్సెస్ చెల్లి.. కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల..! కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల ఉండనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలతో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ మొదటి లిస్ట్ రానుంది. By Jyoshna Sappogula 18 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Sharmila V/s Avinash: ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాల్లో ఫుల్ జోష్ ప్రదర్శిస్తోంది. ఏపీసీసీ చీఫ్ షర్మిల సొంత అన్న సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేదని, ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఇలా పలు అంశాలు చూపిస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఎంపీ బరిలో షర్మిల? ఇదిలా ఉండగా.. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధికార పార్టీ వైసీపీ.. ఇప్పటికే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. పులివెందుల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నిలస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. అయితే, అవినాష్ కు పోటీగా కడప ఎంపీ బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల ఉండనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలతో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. Also Read: ‘గొడ్డలి కోసం దస్తగిరి కదిరి పోయినాడు’.. సంచలనం సృష్టిస్తోన్న YS వివేక బయోపిక్ ట్రైలర్! మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎంపీ సీటు కోసమే వివేకాను అవినాష్ రెడ్డి హత్య చేయించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వరని వార్తలు వచ్చాయి. అయినప్పటికి సీఎం జగన్ టికెట్ కేటాయించారు. త్వరలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ మరి నిజంగానే అవినాష్ కు పోటీగా వైఎస్ షర్మిల బరిలోకి దిగుతారా? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే వైఎస్ వివేకా, వైఎస్సాఆర్ అభిమానులు షర్మిలకు అండగా నిలబడే అవకాశం కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఉండి కూడా వివేకా హత్య కేసులో న్యాయం చేయలేకపోయారని సొంత చెల్లెల్లు వైఎస్ సునీత, షర్మిల ఇద్దరూ వైసీపీకి వ్యతికేంగా పలు సభల్లో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ మొదటి లిస్ట్ రానుందని ప్రచారం జరుగుతోంది.. మరి ఆ లిస్ట్ లో షర్మిలను కడప ఎంపీగా ప్రకటిస్తారో లేదోనని ఉత్కంఠ నెలకొంది. #sharmila #avinash మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి