CM Jagan: చంద్రబాబు పొత్తులు అందుకే : జగన్

తుప్పు పట్టిన సైకిల్ ను నెట్టడానికి చంద్రబాబుకు వేరే పార్టీల సాయం కావాల్సి వచ్చిందన్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం సభలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం వంటివన్నారు. ప్రజలే శ్రీకృష్ణుడు అయితే, తాను అర్జునుడినని జగన్ అభివర్ణించారు.

New Update
CM Jagan: చంద్రబాబు పొత్తులు అందుకే : జగన్

CM Jagan: ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. మేదరమెట్ల వద్ద వైసీపీ సిద్ధం సభలో ప్రసంగించారు. మరో ఐదేళ్లు తనను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం అని, సిద్ధం అంటే ప్రజా సముద్రం అని కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ సిద్ధం అయ్యాయని, ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధం అయిందన్నారు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం వంటివని, ప్రజలే శ్రీకృష్ణుడు అయితే, తాను అర్జునుడ్ని అని సీఎం జగన్ అభివర్ణించారు.

Also Read: జీవిత సహచరులతో ఇలా ఎప్పుడూ చేయకండి.. బంధం తెగనీయకండి!

చంద్రబాబు మాదిరిగా తనకు నటించే పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ లేరన్నారు. మీ బిడ్డకు రకరకాల పొత్తులు లేవని.. ఎన్నికలకు మీ బిడ్డ ఒంటరిగానే వెళుతున్నాడని పేర్కొన్నారు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో.. తనకు అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు.  ఇసుక వేస్తే రాలనంతగా ఉన్న మీరందరూ కూడా  స్టార్ క్యాంపెయినర్లేనని కామెంట్స్ చేశారు. ఎన్నికలు సమీపిస్తుంటే జగన్ పేరు వింటేనే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కౌంటర్లు వేశారు. మీ బిడ్డ ఇంటింటికీ చేసిన అభివృద్ధిని చూసి చంద్రబాబు భయపడుతున్నాడని.. మనలను నేరుగా ఎదుర్కొనలేక ఢిల్లీకి వెళ్లి పొత్తులు పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. మన ఎమ్మెల్యేలు గడపగడపకు తిరుగుతుంటే, చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఇతర పార్టీల గడపలకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

Also Read: దేవుడికి పూజలు ఎందుకు చేయాలి.. బిగ్ బాస్ ఫేమ్ కీర్తి షాకింగ్ కామెంట్స్

మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదని.. మేనిఫెస్టో ఒక పవిత్ర గ్రంథం అని పేర్కొన్నారు. లంచాలు లేని, వివక్ష లేని పాలన నుంచి మన ఫ్యానుకు కరెంటు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పరిస్థితి గమనిస్తే.. ఈ ఎన్నికలకు ఆయన తుప్పు పట్టిన సైకిల్ తో వస్తున్నాడని కౌంటర్ వేశారు.  బాబు పేరు చెబితే ఒక్క మంచి కూడా గుర్తుకు రాదని.. అందుకే పొత్తుల్లో భాగంగా ముందు ఒక ప్యాకేజి ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడని దుయ్యబట్టారు. ఈ దత్తపుత్రుడు సైకిల్ సీటు కావాలని అడగడని., తన వాళ్లకు సీట్లు కావాలని అడగనే అడగడని.. అందుకే ఈ ప్యాకేజీ స్టార్ ను తెచ్చుకున్నాడని కామెంట్స్ చేశారు. ఈ దత్తపుత్రుడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు.. స్టాండ్ అంటే నిలబడతాడని పేర్కొన్నారు. పొత్తుల్లో ఉండమంటే ఉంటాడు.. విభేదించినట్టు నటించేలా డ్రామా ఆడమంటే రక్తి కట్టించేలా డ్రామా ఆడతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చంద్రబాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా గెలిచేది మన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు