PRANEETH: రోస్టింగ్‌ పేరుతో రోత కామెంట్లు.. యూట్యూబర్‌ ప్రణీత్ అరెస్ట్!

రోస్టింగ్‌ కామెడీ పేరుతో తండ్రి, కూతురు బంధంపై రోత కామెంట్లు పెడుతున్న యూట్యూబర్‌ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో సాయి ధరమ్‌ తేజ్‌ విజ్ఞప్తితో వెంటనే యాక్షన్ మొదలుపెట్టిన తెలంగాణ పోలీసులు అతన్ని బెంగళూరులో పట్టుకున్నారు.  

PRANEETH: రోస్టింగ్‌ పేరుతో రోత కామెంట్లు.. యూట్యూబర్‌ ప్రణీత్ అరెస్ట్!
New Update

Praneeth Hanumanthu: యూట్యూబర్‌ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. తెలంగాణ సైబర్‌ క్రైమ్ పోలీసులు అతన్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అనంతరంప్రణీత్‌ను బెంగళూరు కోర్టులో హాజరు పరిచి PT వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకురానున్న పోలీసులు తెలిపారు. తండ్రి, కూతురు బంధంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రణీత్‌ పూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రోస్టింగ్‌ కామెడీ పేరుతో రోత కామెంట్లు పెడుతున్నాడంటూ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ విజ్ఞప్తితో తెలగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ప్రణీత్‌ హన్మంతు, అతడి ముగ్గురు స్నేహితులు కలిసి ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్రదృష్టితో చూపించారు. సోషల్‌ మీడియా వేదికగా దారుణ వ్యాఖ్యలు చేశారు. ప్రణీత్‌ హన్మంతు బృందం వీడియో చూసిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి రాక్షసులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం హీరో మంచు మనోజ్‌ కూడా అదే స్ధాయిలో తన ఎక్స్‌ ఖాతాలో సదరు యూట్యూబర్‌పై విరుచుకుపడ్డారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో పాటుగా టెక్సస్‌ అధికారులు, యుఎస్‌ రాయబార కార్యాలయాన్ని ఆయన ట్యాగ్‌ చేసి ప్రణీత్‌ హన్మంతుపై చర్య తీసుకోవాలని కోరారు.

తప్పు చేశానంటూ ప్రణీత్ పశ్చత్తాపం..
ఈ వివాదానికి కారణమైన ప్రణీత్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. తాను కావాలని అలా మాట్లాడలేదని.. హాస్యం చేద్దామనుకుంటే అది గీత దాటి తప్పుగా వెళ్లిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. తన కుటుంబానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని, దయచేసి వారిని దీనిలోకి లాగొద్దని వేడుకున్నాడు.

#arrested #youtuber-praneet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe