YouTube Remix: ఇప్పుడు అంతా డిజిటల్ మీడియా హవా.. అందులోనూ యూట్యూబ్ హంగామా అంతా ఇంతా కాదు. షార్ట్స్.. రీల్స్ ప్రవేశపెట్టాకా.. యూట్యూబ్ లో జనసందడి విపరీతంగా పెరిగిపోయింది. దాదాపుగా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చూడటం తప్పనిసరి. అందులో చాలామంది యూట్యూబ్ లో రీల్స్ లాంటి కంటెంట్ ఇవ్వడమూ రివాజైపోయింది. యూట్యూబ్ కి ఉన్న ఫాలోయింగ్ తో ఎప్పటికప్పుడు దానిని కొత్త కొత్త హంగులతో నింపేస్తూ వస్తున్నారు. ఇదిగో ఇప్పుడు ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ కొత్త రీమిక్స్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ సహాయంతో ఆథరైజ్డ్ మ్యూజిక్ వీడియోల నుంచి ఆడియో క్లిప్స్ ను క్రియేటర్స్ తమ షార్ట్స్ లో యాడ్ చేసుకునే వీలు కలుగుతుంది. ఈ ఫీచర్‌తో యూట్యూబ్‌లో చిన్న వీడియోలను తయారు చేయడం వినియోగదారులకు సులభతరం అవుతుందని యూట్యూబ్ తెలిపింది. దీనితో, వినియోగదారులు ఇప్పుడు అధికారిక మ్యూజిక్ వీడియో నుండి క్లిప్ లేదా ఆడియోను ఉపయోగించగలుగుతారు. అయితే.. యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ వంటి పెద్ద రికార్డ్ లేబుల్‌లతో దాని పోటీదారు టిక్‌టాక్ ప్రస్తుతం లైసెన్సింగ్ వివాదాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ (YouTube Remix)ఈ ఫీచర్‌ను విడుదల చేయడం గమనార్హం. కొత్త రీమిక్స్ ఫీచర్ ఇప్పుడు యూట్యూబ్ మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంది. రీమిక్స్ ఫీచర్‌ని ఉపయోగించడానికి, వినియోగదారులు మ్యూజిక్ వీడియోలో ‘రీమిక్స్’ని ట్యాప్ చేయవచ్చు.
పూర్తిగా చదవండి..YouTube Remix: యూట్యూబ్ లో కొత్త ఫీచర్.. షార్ట్స్ క్రియేటర్స్ మడత పెట్టేయొచ్చు..
యూట్యూబ్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో వీడియో క్రియేటర్లు అఫీషియల్ ఆడియో-వీడియో కంటెంట్ ను తమ వీడియోలకుయాడ్ చేసుకోగలుగుతారు. రీమిక్స్ పేరుతొ ఈ ఫీచర్ తీసుకువచ్చారు. ఇది టిక్ టాక్ రీమిక్స్ ఫీచర్ లానే పనిచేస్తుంది
Translate this News: