Hyderabad: అన్న కాదు కాలయముడు...తమ్ముడిని ఏం చేశాడో తెలుసా..? రోజురోజుకు మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతోంది. రాక్షసత్వంతో రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది. అన్నాతమ్ముళ్ళు అంటే ఒకరికొకరు ఆప్యాయత, అనురాగాలతో కలిసి ఉంటారని తెలుసు. ఇద్దరు కలిసి.. ఒకటిగా ఉండాల్సింది పోయి.. ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు. By Vijaya Nimma 07 Oct 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి రోజురోజుకు మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతోంది. రాక్షసత్వంతో రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది. అన్నాతమ్ముళ్ళు అంటే ఒకరికొకరు ఆప్యాయత, అనురాగాలతో కలిసి ఉంటారని తెలుసు. ఇద్దరు కలిసి.. ఒకటిగా ఉండాల్సింది పోయి..ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పెరిగిన స్వార్థం ప్రేమానుబంధాలకు అర్థాన్ని చెరిపేస్తోంది. ఓ అన్నను చూసి ఓర్వలేని తమ్ముడు ఏకంగా అన్ననే హతమార్చాడంటే.. ఈ మనుషుల్లో రాక్షసప్రవృత్తి ఎంతగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. హత్య చేసి ఆత్మహత్యగా.. మానవత్వం మర్చిపోయి సోంత అన్నను హత్య చేసి చంపిన దారుణ సంఘటన హైదరాబాద్ (Hyderabad) శివారు అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet) పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మజీద్‌పూర్‌లో అన్నను తమ్ముడు చంపేశాడు. బైక్‌పై వెళ్తున్న అన్న రామచంద్రంను ఆటోతో ఢీకొట్టి చంపిచాడు తమ్ముడు శ్రీశైలం. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేశాడు. సీసీఫుటేజీ చూసి హత్య అని పోలీసులు తేల్చారు. హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీశైలం (Accused Srisailam) పారిపోయాడు. ఈ హత్యకు సహకరించిన మరో ముగ్గురుపై పోలీసులు (police) ఆరా తీసుకున్నారు. అయితే.. ఈ గొడవకు కారణం అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా కుటుంబ తగాదాలు నడుస్తున్నాయని తెలిపారు. పంచాయతీలో పెట్టి తమ్ముడిదే తప్పని పెద్దలు తేల్చారు. దీంతో అన్నపై కోపం పెంచుకున్న తమ్ముడు ఈ దారుణానికి వడిగట్టాడు. అంతకంటే ముండే తాగిన మైకంలో ఇద్దరు గోడవ పడినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. ఈ ఘటనపై గ్రామ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత అన్నదమ్ములు ఏ గోడవులు ఉన్నా మాటలతో సమస్యను పరిష్కరించుకోవాలి కానీ.. ఇంత దారుణంగా చంపడం అనేది కరెక్ట్ కాదని అక్కడున్న ప్రజలు చెబుతున్నారు. ఇంత అన్యాయంగా... కుటుంబ పెద్దని కోల్పోవడంతో మృతుడి బంధువులు ఆవేశానికి లోనైన తమ్ముడు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న సామాన్లను ధ్వంసం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులపై దాడి కూడా చేశారు. మా కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన తమ్ముడు శ్రీశైలంను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వచ్చి పోలీసులు పరిశీలించారు. హత్యకు గల కారణాలను స్థానికులు, మృతుడి భార్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem dead body) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు (case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: మద్యం కోసం సిబ్బంది అతి తెలివి.. నివ్వెరపోయిన అధికారులు #hyderabad #younger-brother #killed-anna #abdullahpurmet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి