Vizag Crime: 12 గంటల పాటు రాళ్ల గుట్టల్లో యువతి నరకయాతన!

విశాఖపట్నం (Vizag) లో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణాజిల్లా మచిలీపట్నానికి (Machilipatnam)  చెందిన ఓ యువతి (18) వారం రోజుల క్రితం ఇంట్లో వారికి తెలియకుండా తన ప్రియునితో కలిసి విశాఖకు పారిపోయి వచ్చింది

Vizag Crime: 12 గంటల పాటు రాళ్ల గుట్టల్లో యువతి నరకయాతన!
New Update

ప్రేమించిన వ్యక్తితో ఇంట్లో చెప్పకుండా విశాఖ పట్నం పారిపోయి వచ్చింది. వారం రోజులు ఇద్దరు చాలా జాలీగా గడిపారు. ఇక నాకు ఏ భయం లేదు నేను కోరుకున్న వ్యక్తి నాతోనే ఉన్నాడు అనుకుంది..కానీ ఆపద సమయంలో వదిలేసి పారిపోతాడని ఊహించలేకపోయింది పాపం ఆ అమ్మాయి. అండగా ఉండాల్సిన వాడు వదిలేసి పోవడంతో 12 గంటల పాటు చావుతో పోరాడి నిలిచింది.

విశాఖపట్నం (Vizag) లో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణాజిల్లా మచిలీపట్నానికి (Machilipatnam)  చెందిన ఓ యువతి (18) వారం రోజుల క్రితం ఇంట్లో వారికి తెలియకుండా తన ప్రియునితో కలిసి విశాఖకు పారిపోయి వచ్చింది. ఈ క్రమంలో వారు అప్పికొండ శివాలయం ప్రాంతంలో ఉంటున్నారు.

Also read: ఈడీ ముందుకు నవదీప్‌!

ఆదివారం సాయంత్రం ఇద్దరూ కూడా విశాఖ బీచ్‌ కు వెళ్లగా అక్కడ సరదాగా ఫోటోలు తీసుకుంటుండగా..యువతి కాలు జారి రాళ్ల మధ్యన పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో యువతి కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరగడంతో భయపడిన యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు.

దిక్కుతోచని స్థితిలో యువతి రాత్రంతా కూడా రాళ్ల మధ్యే ఉండిపోయింది. సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు యువతిని గుర్తించి స్థానిక జాలర్లుకు చెప్పగా..వారు యువతిని కాపాడి బయటకు తీసుకుని వచ్చారు. యువతిని యువకుడి గురించి ప్రశ్నించగా ఆమె కన్నీళ్లతో ఆమె యువకుడిని ఏమి అనవద్దని కన్నీళ్లు పెట్టుకుంది.

యువతిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. యువతిని ప్రమాదం గురించి ప్రశ్నించగా..కాలుజారి పడిపోయానని తెలిపింది. అంబులెన్స్‌ సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా..వారు వైజాగ్‌ వస్తున్నట్లు తెలిపారు. వారు ఇప్పటికే మచిలీపట్నం పోలీసులకు కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్న యువకుడికి ప్రమాదం జరిగిందని, అతను కూడా కేజీహెచ్‌లో ఉన్నట్లు సమాచారం.

#machilipatnam #young-girl #vizag
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe