Viral Video: ప్రపంచంలో ఎంతోమంది వింతైన మనుషులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఓ యువకుడు లోకల్ ట్రైన్లో చేసిన విన్యాసాలు వైరల్‌గా మారాయి. 360 డిగ్రీస్‌లో బాడీ పార్ట్స్‌ని తిప్పుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు కడ్డీలు పట్టుకుని వేలాడుతూ శరీర భాగాలను రబ్బరు బొమ్మలా తిప్పుతున్న వీడియో వైరల్‌గా మారింది.
యువకుడి టాలెంట్‌కి ఫిదా..
ఇద్దరు స్నేహితులు యువకుడి కాళ్లను పట్టుకుని అటునుంచి ఇటు తిప్పడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి 681K లైక్స్ వచ్చాయి. ఎంతో మంది ఈ యువకుడి టాలెంట్‌కి ఫిదా అవుతున్నారు. 180, 360 డిగ్రీలు కాదు ఇంకా ఎన్ని డిగ్రీలు ఉన్నా శరీరాన్ని తిప్పేందుకు యువకుడు రెడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.అది శరీరం అనుకున్నారా లేక ఏదైనా రబ్బరు బొమ్మనా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/reel/C_av05Aox-C/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
స్ప్రింగ్‌లు ఏమైనా పెట్టుకున్నావా బ్రో బాడీలో అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. అథ్లెటిక్స్‌లో కూడా ఇలాంటి విన్యాసాలు చూసి ఉండబోమని, గిన్నిస్ రికార్డులను మించిన రికార్డు ఏదైనా ఉంటే ఈ యువకుడికి ఇవ్వొచ్చంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: భోజనంతో పాటు పచ్చిమిర్చి తింటే ప్రయోజనమా?
ఇది కూడా చదవండి: జుట్టుబాగా రాలుతుందా.. అశ్వగంధ వాడండి