Women Smoking: పాపులారిటీ కోసం సోషల్ మీడియా వినియోగదారులు ఎంతకైనా తెగిస్తున్నారు. యూట్యూబ్, ఇన్ స్టా, ఎక్స్ తదితర వేదికల్లో డేంజర్ స్టంట్స్ చేస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారు. తాజాగా నార్త్ ఇండియాకు చెందిన ఓ మహిళా చంటిబిడ్డను ఎత్తుకుని ప్రమాద కరమైన రీల్స్ చేసి విమర్శలపాలవుతోంది.
ఈ మేరకు 30 ఏళ్ల యువతి చంకన దాదాపు 8 నెలల చంటిబిడ్డను ఎత్తుకుని, సిగరేట్ తాగుతూ రీల్స్ చేసి నెట్టింట పోస్ట్ పెట్టింది. అంతేకాదు ఓ పాటకు చిందులేస్తూ సిగరేట్ పొగను పిల్లవాడిపైకి వదలడంతో పసిబిడ్డ శ్వాస తీసుకోవడం కోసం ఇబ్బంది పడ్డాడు. ఊపిరి బిగపట్టి చిన్నగ దగ్గటం ఇందులో గమనించవచ్చు. అయితే ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'పసిపాపను పట్టుకొని ఆ స్త్రీ పొగతాగుతోంది. పిల్లవాడు దగ్గుతూనే ఉన్నాడు. పసిపిల్లలు సెకండ్ హ్యాండ్ పొగకు గురవుతున్నారు. పిల్లల హక్కులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. రీల్ పిచ్చి ఇంత దూరం వెళ్లిందా?' అంటూ సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: దారుణం.. మొదటి భార్య కోసం రెండో భార్యను చంపిన భర్త.!