Barley Seeds Benefits: బార్లీ గింజలు చేసే మేలు తెలిస్తే షాక్ అవుతారు..! గోధుమల కన్నా బార్లీ గింజలతోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. చాలామంది బార్లీ గింజలను నీటిలో మరిగించి, నిమ్మరసం, తేనె కలుపుకుని తాగుతుంటారు. ఇలా తరచూ తాగితే అనేక సమస్యలు దూరం అవుతాయి. మధుమేహం ఉన్నవారికి కూడా ఈ గింజలు మంచివి. By Vijaya Nimma 27 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Barley Seeds Benefits: ఈరోజుల్లో చాలా మందికి బార్లీ గింజలంటే ఎక్కువగా తెలియక పోవచ్చు. కానీ పూర్వకాలంలో ఈ గింజలను ఎక్కువగా వాడేవారు. అందుకే మన పెద్దలు ఇప్పటికి మంచి ఆరోగ్యంతో ఉన్నారంటే అందుకు కారణం ఇవే. బార్లీ గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజు పొద్దున్నే ఖాళీ కడుపుతో వీటితో తయారు చేసిన నీటిని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో బార్లీ నీరు బెస్ట్. బార్లీలో మూత్రవిసర్జన లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మన శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుటకు బార్లీ బాగా పనిచేస్తాయి. శరీరంలోని అదనపు నీటిని, ఉబ్బరం ప్రమాదాన్ని తొలగిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ. కావునా.. బరువు తగ్గాలి అనుకునేవారు బార్లీ నీటిని ప్రయత్నిస్తే చాలా మంచిదని వైద్యులు అంటున్నారు. బార్లీ నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు: చిన్న సైజులో ఉండే కిడ్నీ స్టోన్లు కరిగిపోవాలంటే బార్లీ నీటిని తాగడం ఉత్తమం. నిత్యం బార్లీ నీటిని తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, కడుపులో మంట, మలబద్దకం ఉన్నవారు బార్లీ నీటిని రోజూ తీసుకుంటే మంచిది. మధుమేహం ఉన్నవారు షుగర్ స్థాయిలు అదుపులో ఉండాలటే బార్లీ నీటిని నిత్యం తీసుకోవాలి. బార్లీ నీటిని తాగితే శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలన్నీ బయటికి పోతాయి. దీంతో లోపలి పెద్ద పేగు శుభ్రంగా ఉంటుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండే వారు బార్లీ నీటిని తాగడం వల్ల వేడి త్వరగా తగ్గుతుంది. బార్లీ నీటిని తాగితే మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. ఉదయం, సాయంత్రం బార్లీ నీటిని తాగితే అధిక బరువు తగ్గాలనుకునే వారు బెస్ట్. Also Read: సముద్ర చేపలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. తప్పక తెలుసుకోండి! బార్లీ నీటి ఇలా తయారీ: గుప్పెడు బార్లీ గింజలు ఒక పాత్రలో లీటర్ నీటిని పోసి15 నుంచి 20 నిమిషాలు మరిగించాలి. ఇలా చేస్తే బార్లీ గింజలు మెత్తగా మారిగి పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్తాయి. అనంతరం.. ఆ నీటిని చల్లార్చి గింజలను వడకట్టి కొద్దిగా నిమ్మరసం, తేనెను కలుపుకుని రోజూ తాగాలి. ఇలా చేస్తే పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. #health-benefits #barley-seeds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి