Rajasthan: చిరుతను మట్టుబెట్టిన యువకుడు!

సాధారణంగా వన్యమృగాలు అంటే మనుషులలో భయం ఉంటుంది. అందులో చిరుతపులి అంటే ప్రాణాలు గాలిలో కలిసినంత పనవుతుంది. కాని ఓ యువకుడు ఆ చిరుతపులినే మట్టుబెట్టిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

New Update
Rajasthan: చిరుతను మట్టుబెట్టిన యువకుడు!

రాజస్థాన్ లోని దుంగార్‌పూర్ జిల్లాలో ఓ మనిషికి చిరుతపులికి మధ్య జరిగిన యుద్ధ సంఘటన వెలుగులోకి వచ్చింది. దుంగార్‌పూర్ జిల్లా భదర్ అటవీ ప్రాంతంలోని గడియా భదర్ మెట్‌వాలా గ్రామంలో ఓ యువకుడిపై చిరుతపులి దాడి చేసింది.  అయితే  ఆ సమయంలో  యువకుడు కూడా ధైర్యాన్ని ప్రదర్శించి చిరుతపులితో పోరాడాడు. తరువాత ఆ చిరుతపులి పై కూర్చొని దానిని మట్టు పెట్టాడు. ఇది చూసిన ప్రజలు ధైర్యం చేసి చిరుతను తాళ్లలో కట్టి పట్టుకున్నారు.

ఆదివారం గడియా భదర్ మెట్వాలా గ్రామంలోని ఓ ఇంటి వెనుక ఉన్న మేఘ్ చెరువు సమీపంలో చిరుతపులి కనిపించింది. ఓ దూడను వేటాడి చిరుత పొదల్లో కూర్చుని  తింటోంది. దీనిని గమనించిన స్థానికులు చిరుతను అడవిలోకి తరిమి కోట్టేందుకు ప్రయత్నించారు.ఆ సమయంలో చిరుత అడవిలోకి కాకుండా ప్రజల వైపుకు పరుగెత్తింది. గున్వంత్ కలాల్ అనే యువకుడిపై చిరుత దాడి చేసింది. పాంథర్ దాని దవడల్లో గున్వంత్ కాలు ఒకటి పట్టుకుంది. చిరుతపులి దాడి చేయగానే మరికొందరు పరుగులు తీశారు. తనను తాను రక్షించుకోవడానికి, గున్వంత్ తన మరో కాలితో పాంథర్ దవడను కొట్టాడు.

చిరుత యువకుడి మధ్య 5 నిమిషాల పాటు పోరాటం కొనసాగింది.  ఈ సమయంలో, గున్వంత్ పాంథర్‌తో ధైర్యంగా పోరాడి చిరుతని పట్టుకుని, దానిపై  కూర్చున్నాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న గ్రామ ప్రజలు తాళ్లతో దానిని కట్టేశారు. ఆ తర్వాత అటవీశాఖ అధికాారులకు సమాచారం అందించారు. చిరుతను ధైర్యంగా ఎదుర్కున్న ఆ యువకుడిపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపించారు.

Advertisment
తాజా కథనాలు