మీ వద్ద ఇంకా రూ. 2 వేల నోట్లు ఉన్నాయా?.గతంలో మార్చుకోవడం వీలు కాలేదా..? అయితే ఆర్బీఐ ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ ని ఉపయోగించుకోండి. నోట్లు మార్చుకునేందుకు ఇక నుంచి పెద్ద పెద్ద క్యూ లైన్లో నుంచోవాల్సిన అవసరం లేదు. మీ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను పోస్ట్ ద్వారా తమ ప్రాంతీయ కార్యాలయాలకు పంపితే నోట్లను సులభంగా మార్చుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది.
అందుకోసం టీఎల్‌ఆర్ ట్రిపుల్ లాక్ రిసెప్టాకిల్ ఫామ్ ను అందిస్తున్నట్లు పేర్కొంది. ఆర్బీఐ రీజనల్ ఆఫీసులకు దూరంగా ఉన్న వారికి ఈ సువర్ణావకాశం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ప్రజలు తమ బ్యాంకు అకౌంట్లలో సురక్షితంగా డిపాజిట్ చేసుకునేందుకు రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ రీజనల్ కార్యాలయాలకు పోస్టు ద్వారా పంపేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ రోహిత్ పి దాస్ వివరించారు.
టీఎల్‌ఆర్ సురక్షితమైనదని ఆయన వివరించారు. దీని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. ఇప్పటికే ఢిల్లీ ఆఫీసుకు 700 టీఎల్‌ఆర్ ఫారాలు అందినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రీజనల్ ఆఫీసుల్లో నోట్లను మార్చుకునేందుకు కొన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
ఢిల్లీ ఆర్బీఐ కార్యాలయంలో సీనియర్ సిటజన్లతో పాటు దివ్యాంగులకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ వద్ద తక్కువ నోట్లు ఉన్నట్లయితే వారికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా..ఏర్పాట్లు చేసినట్లు దాస్ చెప్పారు.
ప్రస్తుతం రూ. 2 వేల నోట్లు చట్టబద్దంగానే చెల్లుబాటు అవుతున్నట్లు ఆయన వివరించారు. అలాగే ఇప్పటి వరకు 97 శాతానికి పైగా రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చినట్లు తెలిపారు. ఇంకా ప్రజల వద్దనే రూ. 10 వేల కోట్లు విలువైన నోట్లు ఉన్నట్లు ఆయన వివరించారు. మే 19వ తేదీన రూ. 2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ముందు వాటిని మార్చుకునేందుకు..తమ ఖాతాలో డిపాజిట్ చేసుకునేందుకు ముందు సెప్టెంబర్ 30 వరకు నాలుగు నెలల పాటు అవకాశం కల్పించింది. ఆ తరువాత మరో వారం పాటు గడవు పెంచింది. అయితే, ఇప్పుడు బ్యాంకులు తీసుకోకపోవడంతో ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద నోట్ల మార్పిడి కోసం జనం బారులుతీరుతున్నారు.
Also read: రాత్రి నిద్రపట్టడం లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..కుంభకర్ణుడు కూడా మీ తర్వాతే..!!