Skin Care Beauty Tips: పెరుగుతో ఆరోగ్యమే కాదు అందం కూడా.. ఎలానో తెలుసుకోండి!

అందంగా ఉండాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసం రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల కొన్ని కొన్ని సందర్భాలలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నాచురల్‌గా తెల్లగా అవటానికి పెరుగులో నిమ్మరసం, తేనె,రోజ్ వాటర్, మినరల్ వాటర్‌ కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

New Update
Skin Care Beauty Tips: పెరుగుతో ఆరోగ్యమే కాదు అందం కూడా.. ఎలానో తెలుసుకోండి!

Skin Care Beauty Tips: పెరుగుతో ఆరోగ్యమే కాదు అందానికి కూడా బాగు చేసుకోవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వాటిల్లో పెరుగు కూడా ఒకటి. పెరుగు ఒక అద్భుతమైన పొటాషియం మెగ్నీషియం, కాలుష్యం, విటమిన్-బి-2 వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పెరుగులో ఉన్నాయి. జీర్ణ క్రియలను మెరుగుపరిచేందుకు, ఎసిడిటీ, కడుపు నొప్పిని తగ్గించేదుకు పెరుగు ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే పెరుగు మన ఆరోగ్యానికి కాదు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగించి చర్మానికి సహజమైన మెరుపు ఇచ్చేందుకు పెరుగు ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా మొఖం మీద నల్ల మచ్చలను ఇది తొలగిస్తుంది. పెరుగులో ఉండే జింక్ నల్ల మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను నివారిస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై ముడతలను తొలగిస్తుంది.
పెరుగులో ఈ ఐటమ్స్‌ కలిసి రాసుకోవాలి:

  • పెరుగులో కొన్ని ఐటమ్స్ కలిపి పేస్ట్ లాగా చేసుకుని మొహానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అందులో ఒకటి కాఫీ పౌడర్‌లో పసుపు, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే బ్లాక్ హెడ్స్ తొలగుతాయి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ వేసుకొని 20 నుంచి 30 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ త్వరగా తొలగిపోతాయి.
  • పెరుగులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని మొఖానికి అప్లై చేసుకున్న తర్వాత 15 నిమిషాల ఉంచుకొని తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొఖం మీద ఉన్న నల్ల మచ్చలు పోతాయి.
  • పెరుగులో మినరల్ వాటర్‌, రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసుకుని దీనిని ముఖానికి అప్లై చేసి 10 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే ఓట్స్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం రంగు మెరుగుపడుతుంది

ఇది కూడా చదవండి: హెర్బల్‌ ‘టీ’తో ఎన్నో ప్రయోజనాలు.. అనేక ఆరోగ్య సమస్యలు పరార్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు