YSRCP: పోస్టల్ బ్యాలెట్ రూల్స్‌పై హైకోర్టుకు వైసీపీ

AP: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సీఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో మెమో జారీ చేశారని పేర్కొన్నారు. సీఈవో జారీ చేసిన మెమోలు రద్దు చేయాలని కోరారు.

New Update
YSRCP: పోస్టల్ బ్యాలెట్ రూల్స్‌పై హైకోర్టుకు వైసీపీ

YSRCP: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా బ్యాలెట్ పై ఆర్వో సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దంటూ సీఈవో మీనా ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకరించింది. కాగా సీఈవో జారీ చేసిన మెమోలు రద్దు చేయాలని కోర్టును కోరింది వైసీపీ.

పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ అభ్యంతరాలపై ఈసీ రిప్లై..

డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కౌంటింగ్ రోజు సంబందిత రిటర్నింగ్ అధికారి గేజిటెడ్ అధికారి సంతకం సరిచూసుకుని బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభించవచ్చునని ఈసి క్లారిటీ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్లను వాలీడ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు ఇచ్చింది. ఏపీ సీఈవోకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాశారు.

Advertisment
తాజా కథనాలు