YCP: పల్నాడు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. దాచుకు దోచుకో పంచుకో అనేది చంద్రబాబు సిద్ధాంతం అని కౌంటర్ వేశారు.కానీ,వైసీపీ ప్రభుత్వం టీడీపీలా కాదని అన్నారు. మా ప్రభుత్వం డిపిటి ద్వారా 2 లక్షల 45 వేల కోట్లు నేరుగా ప్రజల ఖాతాలో వేసిందని తెలిపారు. నాడు నేడు కింద స్కూల్స్ ను అభివృద్ధి చేశామని..ఎన్నడూ లేని విధంగా విద్య కోసం 65 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. గతంలో విద్యారంగంలో మన రాష్ట్రం 15 స్థానంలో ఉండేదని..కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడో స్థానానికి వచ్చిందని వెల్లడించారు. మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును ప్రజలకు వివరిద్దామని ఈ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు.
పూర్తిగా చదవండి..వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర చేసేది ఇందుకే..!
పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు మాట్లాడుతూ..పేద, బడుగు వర్గాలకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు.

Translate this News: