White Quartz Mafia: వైసీపీ హయాంలో ఏపీలోని నెల్లూరు జిల్లా కేంద్రంగా రూ. 5వేల కోట్ల స్కామ్ జరిగినట్లు పలు ఆధారాలు బయటపడటం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. నెల్లూరు జిల్లా మాజీమంత్రి అండదండలతో అడ్డగోలు దోపిడీలు జరిగాయని, ముఖ్యంగా ఏడాదికి రూ. 5వేల కోట్ల విలువైన వైట్ క్వార్ట్జ్ మాఫియాకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఖనిజ సంపదనంతా చైనాకు తరలించినట్లు పలు ఆధారాలు RTV చేతికి చిక్కాయి.
ఈ మేరకు సర్వేపల్లి, వెంకటగిరీ నియోజకవర్గాల కేంద్రంగా జరిగిన దందాలో ప్రధాన సూత్రదారులుగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కారుమూరి అల్లుడు దిలీప్ కుమార్ ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు సైదాపురంకు చెందిన చరణ్‌రెడ్డి కృష్ణంరాజు, సర్వేపల్లికి చెందిన శ్యామ్ ప్రసాద్, గూడూరుకి చెందిన జిమ్ ట్రైనర్ శ్రీకాంత్రెడ్డి సిండికేట్‌గా ఏర్పడి 100 గనులను కొల్లగొట్టినట్లు వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Ukraine: ఉక్రెయిన్ లోకి అమెరికా బలగాలు.. బైడెన్ సర్కార్ బిగ్ స్కెచ్!
పుట్ట రమణమ్మ అనే మహిళకు సంబంధించిన భూమిని ధరణి బ్రిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరుతో ఐదేళ్లపాటు లీజుకు తీసుకున్న కారుమూరి కుటంబం.. ఐదేళ్లపాటు వైట్ క్వార్ట్జ్ మాఫియాకు పాల్పడింది. దీంతో తన భూమిలో చట్టవ్యరేఖ చర్యలకు పాల్పడుతున్నారంటూ CIDకి ఫిర్యాదు అందడంతో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే CIDకి అందిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన CMO ఈ స్కామ్ వెనుక అసలు సూత్రధారులు ఎంతమంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తోంది.