AP Elections 2024: వైసీపీకి షాక్.. టీడీపీలోకి మాజీ మంత్రి పార్థసారథి?

వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ అధినేత చంద్రబాబును ఈ రోజు ఉదయం కలిసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7 లేదా 8 తేదీల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. సీఎం జగన్ తనను గుర్తించడం లేదంటూ ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Elections 2024: వైసీపీకి షాక్.. టీడీపీలోకి మాజీ మంత్రి పార్థసారథి?
New Update

వైసీపీకి షాక్ ఇచ్చేందుకు మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) సిద్ధమైనట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7,8 తేదీల్లో ఆయన టీడీపీలో (TDP) చేరడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఈ రోజు ఉదయం నుంచి పార్థసారధి, ఆయన అనుచరులు మీడియాకు, ఇతర నాయకులకు అందుబాటులోకి రాకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. టీడీపీ నేతలు మాత్రం పార్థసారథి తమ అధినేతను కలిసినట్లు చెబుతున్నారు.

ఇటీవల కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో జరిగిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించాయి. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్‌ తనను గుర్తించడం లేదని ఆయన అన్నారు. కానీ నియోజకవర్గ ప్రజలు మాత్రం గుర్తించారన్నారు. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని, ఎటువంటి అవమానాలు ఎదురైనా కాపాడుతూ వస్తున్నారన్నారు. దీంతో ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం ఆసమయంలో బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Narsarao Peta MP ticket:నేను నరసరావుపేటలో అయితేనే పోటీ చేస్తా…లావు శ్రీకృష్ణదేవరాయలు

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నేతల పార్టీ జంపింగ్ లు స్టార్ట్ అయ్యాయి. అనేక స్థానాల్లో సిట్టింగ్ లను మార్చాలని సీఎం జగన్ నిర్ణయించడంతో.. టికెట్ దక్కదని ఖాయమైన వారు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వారు షర్మిల వెంట కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

వైజాగ్ కు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇప్పటికే వైసీపీని వీడి, జనసేనలో చేరిపోయారు. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు కూడా ఇదే బాటలో నడుస్తారన్న టాక్ వినిపిస్తోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాను వైసీపీని వీడనున్నట్లు నిన్న ప్రకటించారు. తానతో పాటు తన భార్య కూడా రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రెండు లిస్టులను విడుదల చేసిన జగన్.. ఒకటి లేదా రెండు రోజుల్లో వైసీపీ అభ్యర్థుల మూడో లిస్ట్ విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

#ap-elections-2024 #ysrcp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe