AYYANNA- ANITHA :అయ్యన్న అరెస్ట్ -అనిత నెక్ట్స్!

టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మహిళా నేత , మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా వైసీపీ కి పంటికింద రాయిలా మారారు.

Anitha : వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణం: హోంమంత్రి అనిత
New Update

తెలుగుదేశం పార్టీలో(TDP) మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు (AYYANNA PATRUDU) సహా కొందరు నేతలు పరుష పదజాలంతో మంత్రులపైనే కాకుండా సీఎం పై కూడా విరుచుకుపడుతున్నారు. మరో వైపు టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మహిళా నేత , మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత (Vangalapudi Anitha) కూడా వైసీపీ కి పంటికింద రాయిలా మారారు.

సీఎం పై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మాజీ మంత్రి పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ ఎయిర్‌ పోర్ట్ లో శుక్రవారం అయ్యన్నను అరెస్ట్ చేసి, మార్గ మధ్యలో నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అయ్యన్నపాత్రుడు సహా అనిత నోటికి తాళం వేయాలనే ఉద్దేశంతో.. అధికార పార్టీ వీరిని టార్గెట్ చేసినట్టు కనపడుతుంది. ఇటీవల పాయకరావుపేట సొంత నియోజకవర్గానికి అనిత వెళ్లకుండా పోలీసులు అడ్డగించగా, రాఖీ పండుగ సందర్భంగా విజయవాడలో అనితను పోలీసులు అడ్డుకున్నారు..

Also Read: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్‌ బాద్‌ షా!

ఈ పరిణామాలు చూస్తుంటే వైసీపీ నెక్స్ట్ టార్గెట్ అనితేనా అనే సందేహం కలుగుతుంది. ప్రస్తుతం వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. పొలిట్ బ్యూరో సభ్యురాలుగా, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు.

ఇప్పటికే అనిత పాయకారావుపేట టికెట్ తనకేనని విశ్వాసంతో ఉన్నారు..ఇటువంటి సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్ద పూర్తి మైలేజ్, మార్కుల కోసం ఏ అవకాశం వచ్చినా సరే వదలకుండా అధికార పార్టీపై మాటల తూటాలను పేల్చుతూ ఫైర్ బ్రాండ్ గా అనిత నిలబడ్డారు.

దీనికి కారణం తన వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడమే కాకుండా, పార్టీ అధిష్టానం వద్ద కూడా తన గ్రాఫ్ పడిపోకూడదు అన్న జాగ్రత్తతో అనిత ఆచితూచి వ్యవహరిస్తూ వైసిపికి పంటి కింద రాయిలా ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వతహాగా టీచర్ వృత్తి నుంచి వచ్చిన అనిత , రాజకీయ రంగంలో ఎటువంటి శిక్షణ లేకుండా తక్కువ టైంలోనే టీడీపీ ఫైర్ బ్రాండ్ గా తెచ్చుకున్నారు.

ఆమె కూడా అవకాశం వచ్చినప్పుడు ఏపీ సీఎంపై ఘాటు వ్యాఖ్యలతో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.. వైసీపీ పై మాటల టపాసులు పేల్చడంలో సిద్ధహస్తులైన అయ్యన్నపై పలు కేసులు పెట్టడంతో, నెక్స్ట్ టార్గెట్ అనితేనని భావిస్తున్నారు..

Also Read: చంద్రబాబు అంతా పెద్ద అవినీతి పరుడు రాష్ట్రంలో లేడు: కొడాలి నాని!

#vangalapudi-anitha #tdp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe