Gorantla Madhav: పార్లమెంట్‌లో పోలీస్‌గా మారిన ఎంపీ గోరంట్ల😎 .. నిందితులను ఎగిరెగిరి ఎలా గుద్దాడో చూడండి!

లోక్‌సభలోకి చోరబడ్డ ఆగంతకులను పట్టుకోవడంతో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ కీ రోల్‌ ప్లే చేశారు. ఆగంతకులను పట్టుకోవడమే కాకుండా వారిని ఎగిరి ఎగిరి కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైలర్‌గా మారింది.

New Update
Gorantla Madhav: పార్లమెంట్‌లో పోలీస్‌గా మారిన ఎంపీ గోరంట్ల😎 .. నిందితులను ఎగిరెగిరి ఎలా గుద్దాడో చూడండి!

వెన్నుచూపలేదు..
కళ్ళెర్ర చేశాడు..
తనలోని పోలీస్‌ను బయటకు తీశాడు..
బల్లలెక్కి దూసుకొచ్చాడు..
ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఒలింపిక్స్‌ను తలపించాడు
చెయ్యి ఎత్తాడు..
లేపిలేపి గుద్దాడు
ఎగిరిఎగిరి తన్నాడు..
ఇది హిందూపుర్‌ ఎంపీ గోరంట్ల మాధవ్‌ పార్లమెంట్‌లో చూపిన యాక్షన్‌ సీన్‌.. 😎


హిందూపుర్‌ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌(Gorantla Madhav) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయనో పోలీస్‌ అని అందరికి తెలిసిందే. గతంలో ఏదో(***) వీడియో వ్యవహారంలోనూ గోరంట్ల పేరు ఇండియా వ్యాప్తంగా మారుమోగింది. ఇలా ఏం చేసినా తనదైన శైలీలో టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారుతుంటారు గోరంట్ల. అనంతపురం పోలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ తనలో ఇంకా పోలీస్‌ బతికే ఉన్నాడని దేశానికి చూపించాడు. లోక్‌సభ జీరో అవర్‌లో ఇద్దరు ఆగంతకులు లోపలికి చోరబడ్డ మేటర్‌ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతుండగా.. ఆ నిందితులను ఎంపీలు పట్టుకున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఎగిరి దూకిన గోరంట్ల మాధవ్‌:
మనోరంజన్‌, సాగర్‌ శర్మ.. ఇద్దరూ లోక్‌సభలోకి చోరబడ్డారు. సెక్యూరిటీ కళ్లగప్పి లోపలికి దూసుకొచ్చారు. షూ లోపల నుంచి బయట తీసిన టీయర్‌ గ్యాస్‌ విసిరారు. అంతే అక్కడున్న ఎంపీలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరికి కాళ్లు, చేతులు కదల్లేదు. మరికొందరు పరుగుపరుగునా బయటకు లాగెత్తారు. అక్కడున్న వాళ్ల గుండె దడ పెరిగిపోయింది. అయితే కాంగ్రెస్‌ ఎంపీలు మాత్రం ఈ ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పారిపోకుండా ఆగంతకులవైపు దూసుకొచ్చారు. వీరిలో పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు ఎక్కువగా ఉండగా.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ తనలోని పోలీస్‌ని బయటకు తీశాడు. అందరూ చప్పచప్పగా నిందితులను కొడుతుంటే గోరంట్ల మాధవ్‌ మాత్రం పోలీస్‌ స్టైల్‌లో చితకబాదాడు. సెహ్వాగ్‌ స్టైల్‌లో దంచికొట్టాడు.

గోరంట్ల ఏం అన్నారంటే?
నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన గోరంట్ల మాధవ్‌ ఈ ఘటనపై స్పందించారు. ‘విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు సభలోకి వచ్చారని గోరంట్ల మాధవ్ చెప్పారు. నిందితుడుని పట్టుకున్నామని.. ఆ లోపే స్మోక్‌ బాంబుని వదిలాడని మాధవ్ చెప్పుకొచ్చారు. నిందితుడు స్మోక్‌బాంబుని షూలో పెట్టుకున్నాడని మాధవ్ క్లారిటీ ఇచ్చారు. నేను గతంలో సీఐగా పనిచేశాను కాబట్టి.. ఆ అనుభవం తనకు పనికొచ్చిందని మాధవ్ చెప్పారు. సెక్యూరిటీ వైఫల్యం లేదు.. కానీ నిందితులు స్మార్ట్‌గా వ్యవహరించారని మాధవ్ తెలిపారు.

Also Read: అదరలేదు.. బెదరలేదు.. టీయర్‌ గ్యాస్‌ విసురుతుంటే రాహుల్‌ ఏం చేశారంటే?

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు