/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/MP-Mithun-Reddy.jpg)
MP Mithun Reddy: పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దిరెడ్డి ఇంటికి పోలీసులు ఎవర్నీ అనుమతించడం లేదు. పుంగనూరు వెళ్లేందుకు సిద్దమైన ఎంపీ మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. తిరుపతిలోనే ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడే వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. పెద్దిరెడ్డి ఇంటి పరిసరాల్లో ఆంక్షలు విధించారు. పెద్దిరెడ్డి ఇంటికి 100 మీటర్లలోనే అందర్నీ ఆపేస్తున్నారు. పోలీసు ఆంక్షలపై మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో వైసీపీ సానుభూతిపరులను బతకనిచ్చేలా లేరు అని అన్నారు. మా మనుషుల ఇళ్లు కూల్చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీగా నా నియోజకవర్గంలోకి నన్ను వెళ్లొద్దు అనడం ఏంటి అని ప్రశ్నించారు.