పవన్, చంద్రబాబు పొత్తులు అనైతికం..వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్.!

తెలంగాణలో పవన్, చంద్రబాబు పొత్తులు అనైతికమైనవని వైసీపీ ఎంపీ భరత్ అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ కు ఓటేయమని చెప్తే, పవన్ బీజేపీకి ఓటేయమని చెప్తారు.. అక్కడ అనైతికంగా ఉంటూ.. ఏపీలో పొత్తులు అంటారు.. అసలు ఇవి ఎలాంటి పొత్తులో ప్రజలే గ్రహించాలని ఆయన కామెంట్స్ చేశారు.

New Update
పవన్, చంద్రబాబు పొత్తులు అనైతికం..వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్.!

YCP MP Margani Bharat Ram: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మధురపుడి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ను పరిశీలించారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. ఈనెల 8 న టెర్మినల్ ను సీఎం జగన్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. అలానే రాజమండ్రి విమానాశ్రయంలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నామని ఇంకా18 విమాన సర్వీసులు పెంచే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు.

Also Read: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. ఆయన జీవితం పోరాటాల పాఠం!

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్. తెలంగాణలో పవన్, చంద్రబాబు పొత్తులు అనైతికమైనవి అని అన్నారు. తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్ కు ఓటు వేయమని చెప్తే, మరోవైపు పవన్ బీజేపీకి ఓటు వేయమని చెప్తారని.. అసలు ఇవి ఎలాంటి పొత్తులో ప్రజలు గ్రహించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జెండాలతో పాటు తెలుగుదేశం జెండాలు ఉంటాయని..మరో పక్క బీజేపీ జెండాలతో జనసేన జెండాలు ఉంటాయని..అక్కడ అనైతికంగా ఉంటూ..ఏపీలో తెలుగుదేశం, జనసేన జెండాలు కలిసి ఉంటున్నాయని, అసలు ఇవి ఏరకంగా అర్ధం చేసుకోవాలో కూడా తెలియడం లేదన్నారు.

Also Read: హామీలు.. గ్యారెంటీలే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపించాయా?

రాజకీయ నాయకులుగా చెప్పుకుంటూ సినిమా యాక్టర్ లు తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రజలకు ఏవిధమైన భరోసా ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. డబ్బులు సంపాదించుకోవడానికా ? పబ్బంగడుపుకోవడానికా ? అమాసకు, పున్నానికి వచ్చే వాడు పవన్ కళ్యాణ్..అని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. నిలకడ లేని రాజకీయం చేసే వ్యక్తులు పవన్, నారా లోకేష్ అని మండిపడ్డారు. రాజకీయనాయకులు ఎప్పుడు ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలి కానీ వీరిలా ఉండకూడదన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు