Duvvada Srinivas : నాపై హత్యాయత్నం.. పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ ఫిర్యాదు

AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పోలీసులను ఆశ్రయించారు. తనపై భార్య, కూతురుపై ఫిర్యాదు చేశారు. ఇంటిగేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నం చేశారని తన భార్య వాణి, కుమార్తె హైందవితో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Duvvada Srinivas : నాపై హత్యాయత్నం.. పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ ఫిర్యాదు
New Update

YCP MLC Duvvada Srinivas : వైసీపీ (YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas) పోలీసులను ఆశ్రయించారు. తనపై భార్య, కూతురుపై ఫిర్యాదు చేశారు. ఇంటిగేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నం చేశారని తన భార్య వాణి, కుమార్తె హైందవితో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

భార్య వాణి, పిల్లల నిరసన..

టెక్కలి (Tekkali) లోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య వాణి, పిల్లల నిరసన కొనసాగుతోంది. రాత్రంతా దువ్వాడ ఇంటి ఆరుబయటనే భార్య వాణి, పెద్ద కుమార్తె హైందవి నిద్రించారు. ఆ సమయంలో ఇంట్లొనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. సమస్యకు పరిష్కారం లభించేంత వరకూ ఇక్కడే ఉంటామని భార్యాబిడ్డలు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

ఇదే వ్యవహారంలో..

గత రెండేళ్లుగా వారి కుటుంబంలో విబేధాలు కొనసాగుతున్నాయి. MLC దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య ZPTC దువ్వాడ వాణి వేరువేరుగా ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జిగా తొలగించి.. భార్య వాణికి బాధ్యతలు అప్పగించింది. అయితే, మళ్లీ ఎన్నికల సమయానికి దువ్వాడ శ్రీనివాస్ కే టికెట్ కేటాయించడంతో ఆ సమయంలో దంపతుల మధ్య వార్ తారాస్థాయికి చేరింది.

Also Read : చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

#ycp-mlc-duvvada-srinivas #tekkali #ap-ycp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe