/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/tdp-17-jpg.webp)
Silpa Chakrapani Reddy : శ్రీశైలం(Srisailam) అభ్యర్థి మార్పుపై వైసీపీ(YCP) తర్జనభర్జన పడుతోంది. తాడేపల్లికి రావాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి(Silpa Chakrapani Reddy) కి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ మార్పుపై చర్చించేందుకంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శిల్పా స్థానంలో బుడ్డా శేషారెడ్డి లేదా బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన అధిష్ఠానం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read: పొరపాటున ఫస్ట్‌నైట్ వీడియో లీక్..సోషల్ మీడియాలో వైరల్
టికెట్ మార్పు చర్చించేందుకే శిల్పాకు పిలుపంటూ ప్రచారం జరుగుతుంది. ఆత్మకూరులో పార్టీ ఆఫీసుకు అనువైన ప్రాంతాలను పరిశీలించారు బుడ్డా శేషారెడ్డి. అయితే, నియోజకవర్గంలో మారుతున్న పరిణామాలు శిల్పా వర్గీయులకు ఏ మాత్రం మింగుడుపడటం లేదని తెలుస్తోంది.
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం.. అంతే కాకుండా ఆయన అనుచరులు చేసిన భూదందాలు, దౌర్జన్యాలు వివాదాస్పదంగా మారడం వల్లే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. లోకేశ్(Lokesh) యువగళం పాదయాత్ర చేసినప్పుడు చక్రపాణిరెడ్డిపై చీటింగ్ చక్రపాణి అని ఆరోపణలు వినిపించాయి.