AP Politics: ఒంగోలు నుంచి నేనే పోటీ చేస్తా.. రేపే అభ్యర్థులు ఫైనల్: బాలినేని కీలక ప్రకటన సీఎం జగన్ తో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తానని ప్రకటించారు. రేపు వైసీపీ అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఫైనల్ అవుతుందని చెప్పారు. By Nikhil 28 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి ఎన్నికల్లో (AP Elections 2024) పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో సీఎం జగన్ (AP CM Jagan) బిజి బిజీగా గడుపుతున్నారు. పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. టికెట్ ఇవ్వలేకపోతున్న వారిని పిలిచి చర్చలు జరుపుతున్నారు. వారికి టికెట్ ఎందుకు ఇవ్వడం లేదో వివరించి సముదాయించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రీజనల్ కో-ఆర్డినేటర్లకు అభ్యర్థులుగా ఎంపిక చేసిన వారి వివరాలను ముందుగానే తెలిపి.. క్షేత్ర స్థాయిలో సమన్వయం చేయాలని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: AP Politics: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. చంద్రబాబుతో డీకే శివకుమార్ చర్చలు ఈ క్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కొద్ది సేపటి క్రితం జగన్ తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక రేపు ఫైనల్ అవుతుందని తెలిపారు. గిద్దలూరు అభ్యర్థి ఎవరో కూడా రేపు సీఎం ఫైనల్ చేస్తారని చెప్పారు. కొన్ని నియోజక వర్గాలకు తనను కూడా వెళ్లి పరిశీలన చేయాలని జగన్ సూచించినట్లు వివరించారు బాలినేని. అనారోగ్య కారణాలతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ కొత్త అభ్యర్థిని వెతికే పనిలో పడింది వైసీపీ హైకమాండ్. #ap-politics #ap-cm-jagan #balineni-srinivasa-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి