YCP: ఎంతకాలం పల్లకి మోసే బోయలుగా ఉండాలి.. మైనార్టీ నేత ఆగ్రహం..! మాజీ మంత్రి నారాయణ తానే గెలిచినట్లు కలలు కంటున్నారని కామెంట్స్ చేశారు వైసీపీ మైనార్టీ నేత సమీర్ ఖాన్. నెల్లూరులో అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలుపొందడం ఖాయమన్నారు. టీడీపీ మైనార్టీలకు ద్రోహం చేస్తుంటే వైసీపీ న్యాయం చేస్తుందన్నారు. By Jyoshna Sappogula 26 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Nellore: మాజీ మంత్రి నారాయణ తానే నెల్లూరులో గెలిచినట్లు కలలుగంటున్నారని ఎద్దెవ చేశారు వైసీపీ మైనార్టీ నేత సమీర్ ఖాన్. ఇక్కడ గెలవాలంటే 70 వేల మంది ముస్లిం మైనార్టీ ఓట్లు కీలకమని పేర్కొన్నారు. నెల్లూరులోని డిఆర్ ఉత్తం హోటల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఈ వ్యాఖ్యాలు చేశారు. టీడీపీ మైనారిటీలకు అడుగడుగునా అన్యాయం చేస్తూ అవమానాలు చేస్తూంటే జగన్ సర్కార్ మైనార్టీలకు అండగా నిలిచి న్యాయం చేశారన్నారు. Also Read: టీడీపీ ఇంచార్జ్ ఆత్మహత్య.. భార్య ఎమోషనల్ వీడియో ..! 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో నెల్లూరు నుంచి మొట్టమొదటిసారిగా ముస్లిం మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే దానిని ఓర్వలేక అనేకమంది విమర్శలు చేస్తున్నారన్నారు. ఎంతకాలం తాము పల్లకి మోసే బోయలుగా ఉండాలని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తున్నామన్నట్లు నారాయణ చెబుతున్నాడని విమర్శలు గుప్పించారు. నెల్లూరులో నారాయణ గెలుస్తారో ముస్లిం మైనార్టీలు గెలుస్తారో సార్వత్రిక ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. నగరంలో 70000 రూరల్ లో 45 వేల ఓట్లు ఉన్నాయని.. గెలుపోటములను నిర్దేశించే శక్తి తమకే ఉందని అన్నారు. Also Read: ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండే సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: మోదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందిస్తూ మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ ముస్లింలకు ద్రోహం చేస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు మంది మైనార్టీలకు టికెట్లు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ ఒకరికి మాత్రమే సీటు కేటాయించిందన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశలు పెట్టుకుని ఉంటే అతనికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా అబ్దుల్., అజీజ్ ను మేయర్ చేసిన ఘనత వైసీపీదే అన్నారు. మైనార్టీలకు టీడీపీ ద్రోహం చేస్తుంటే వైసీపీ న్యాయం చేస్తుందన్నారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో నెల్లూరులో అన్ని స్థానాల్లో వైసీపీ గెలుపొందడం ఖాయమన్నారు. Also Watch This Video: #andhra-pradesh #ap-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి