సిగ్గు - శరం..లేనోళ్లు..! మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ జనసేన పార్టీలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి మండిపడ్డారు. తెలంగాణలో గాంధీభవన్ వద్ద టీడీపీ జెండాలు.. ఏపీలో టీడీపీ కార్యాలయానికి జనసేన జెండాలు కట్టారని.. ఈ పార్టీల వారు సిగ్గు - శరం లేనోళ్లని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

New Update
Andhra Pradesh: పవన్‌కు అది అలవాటే.. మంత్రి అంబటి సెన్సేషనల్ కామెంట్స్..!

Ambati Rambabu: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ(TDP) దూరంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్(Congress) కు పరోక్షంగా మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, అటు ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ (Janasena) తెలంగాణలో బీజేపీ(BJp)తో కలిసి పోటీ చేసింది. అయితే, టీడీపీ జనసేన పార్టీ పొత్తులు అనైతికం అంటూ వైసీపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, వైసీపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) టీడీపీ జనసేనపై సోషల్ మీడియాలో తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ కార్యాలయానికి జనసేన జెండాలు.. గాంధీభవన్ వద్ద టీడీపీ జెండాలు కట్టారని.. ఈ పార్టీల వాళ్లు సిగ్గూ శరం లేనోళ్లని విరుచుకుపడ్డారు.

Also read: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. ఆయన జీవితం పోరాటాల పాఠం!

ఒకవైపు ఏపీలో టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్నా.. తెలంగాణలో ఈ రెండు పార్టీలు వేరేవేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవడంపై వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు. ఈ అనైతిక పొత్తులు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  ఈ రెండు పార్టీల పొత్తులు అనైతికం అంటూ వైసీపీ మంత్రులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..చంద్రబాబు పెద్ద గజదొంగ అని కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే..టీడీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరమని కౌంటర్లు వేశారు. ఎవరికో పుట్టిన బిడ్డను..తన బిడ్డగా చెప్పుకోవడం చంద్రబాబు నైజం అని ఎద్దెవ చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై ఎలాంటి ప్రభావం చూపదని వ్యాఖ్యనించారు. తెలంగాణలో ఎవరు గెలిస్తే ఏంటి..ఎవరు ఓడిపోతే మాకేంటి..? అని అన్నారు.

Also read: హామీలు.. గ్యారెంటీలే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపించాయా?

Advertisment
తాజా కథనాలు