YCP Siddam Sabha: వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ ఆ రోజే..!

బాపట్ల జిల్లా మేదరమీట్ల వద్ద ఈ నెల 10న సిద్దం సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎంపీ విజయ సాయిరెడ్డి. సభలో సీఎం జగన్ మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు తెలిపారు. గతంలో ఏం చేశామో.. రాబోయో కాలంలో ఏం చేస్తామో జగన్ వివరిస్తారని తెలిపారు.

YCP Siddam Sabha: వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ ఆ రోజే..!
New Update

YCP Siddam Sabha: ఒంగోలులో మేదరమెట్ల వద్ద జరగనున్న సిద్దం సభ పోస్టర్ ను వైసీపీ పెద్దలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రీజనల్ కోర్డినేటర్, ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు. బాపట్ల జిల్లా మేదరమీట్ల వద్ద సీఎం జగన్ చివరి సిద్దం సభ ఈ నెల 10 తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సభలో వైసీపీ నాలుగు సంవత్సరం పదినెలలలో చేసిన అభివృద్ధి ..సంక్షేమ పనులను ముఖ్యమంత్రి జగన్ వివరిస్తారన్నారు. మేనిఫెస్టో కూడా సిద్దం సభలో ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏమి చేసాం.. రాబోయో కాలంలో ఏమి చేస్తామో జగన్ వివరిస్తారన్నారు. ఈ సిద్దం సభకు పదిహేను లక్షల మంది హాజరవుతారని అంచన వేస్తున్నట్లు చెప్పారు.

Also Read: వివేక హత్య కేసు.. జగన్ పాత్రపై సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

సిద్దం సభలకు ప్రజా స్పందన భాగా ఉందని వెల్లడించారు. ఒకదానిని మించి ఇంకో సభలకు ప్రజలు పోటెత్తుతున్నారని వ్యాఖ్యానించారు. మార్చి పదవ తేదీ తరువాత ఎలక్షన్ నోటిఫికేషన్ వెలుబడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు.. నలబై మూడు నియోజకవర్గాల నుండి అందరూ నాయకలు కలసి కట్టుగా పని చేస్తూ సిద్దం సభని నిర్వహిస్తున్నాట్లు తెలిపారు.

సిద్దం సభలతో వైసీపీ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందని చెప్పుకొచ్చారు. వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైసీపీ ఏమి చేసిందో ప్రజలకు బాగా తెలుసన్నారు. బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసని కామెంట్స్ చేశారు. సిద్దం సభలకు బస్సులను ఏర్పాటు చేస్తున్నామని.. ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభను నిర్వహిస్తామని కామెంట్స్ చేశారు.

#andhra-pradesh #ycp-siddam-sabha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe