YCP: 'రాబోయే రోజుల్లో మీ పాత్రే కీలకం' వైసీపీ లీగల్ టీమ్ కు ఎమ్మెల్యే హెచ్చరిక.! ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ లీగల్ సెల్ మహాసభ నిర్వహించారు. టీడీపీ నమోదు చేయించే దొంగ ఓట్ల వ్యవహారంపై వైసీపీ లీగల్ టీమ్ దృష్టి పెట్టాలని సూచించారు ఎమ్యెల్యే మల్లాది విష్ణు. రాబోయే రోజుల్లో లాయర్ల పాత్రే కీలకమైందన్నారు. By Jyoshna Sappogula 17 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి YCP Legal Cell Mahasabha: ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ లీగల్ సెల్ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి, వైసీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి , అడ్వకేట్స్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి, ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఛైర్మెన్ మాట్లాడుతూ.. కుల మత వ్యవస్థతో దేశాన్ని నాశనం చేసేవారు కొందరు తయారయ్యారని.. వారి విషయంలో జాగ్రత్తగా వుండాలని అన్నారు. Also Read: నేడు బిగ్ బాస్ ఫైనల్స్.. విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! రాబోయే ఎన్నికల్లో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు మన పార్టీ విజయానికి పనిచేయాలని ఎమ్యెల్యే వెలంపల్లి కోరారు. మరో 20 ఏళ్లు సిఎంగా జగన్ వుండబోతున్నారని జోశ్యం చెప్పారు. పార్టీలో గుర్తింపు లేదని, పదవులు లేవని ఎవ్వరూ బాధరడవద్దని ధైర్యం చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ జరిగిందంటే అది వైసీపీ లీగల్ సెల్ ప్రతిభ అని కొనియాడారు. Also Read: ‘మమ్మల్ని మీరు పీకేస్తే.. మేం మిమ్మల్ని పీకేస్తాం’.. అంగన్వాడీల హెచ్చరిక.! కాగా, రాబోయే రోజుల్లో లాయర్ల పాత్ర కీలకమైందన్నారు ఎమ్యెల్యే మల్లాది విష్ణు. టీడీపీ నమోదు చేయించే దొంగ ఓట్ల వ్యవహారంపై వైసీపీ లీగల్ టీమ్ దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు రాబోయే మూడు నెలలు మారో ఎత్తు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతీ నియోజకవర్గంలో టీమ్స్ గా ఎన్నికలకు పని చెయ్యాలని చెప్పారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి