Big Boss 7: నేడు బిగ్ బాస్ ఫైనల్స్.. విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కు రూ. 50 లక్షల కంటే ప్రైజ్ మనీ ఎక్కువ దక్కనున్నట్లు వార్త హల్ చల్ చేస్తోంది. కచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ ను పల్లవి ప్రశాంత్ కైవసం చేసుకుంటారని నెటిజన్స్ కామోంట్స్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 17 Dec 2023 in సినిమా New Update షేర్ చేయండి Big Boss 7: బిగ్ బాస్ లవర్స్ ఉత్కంఠకు నేడు తెర పడనుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో టైటిల్ విన్నర్ ఎవరా అనేది తేలనుంది. అయితే, విన్నర్ కు ప్రైజ్ మనీ ఎంత ఉంటుందనేది ఆసక్తి కరంగా మారింది. కొంత మంది రూ. 50 లక్షలు అంటుంటే మరికొంత మాత్రం అంతకుమించి ఉండొచ్చు అని చర్చించుకుంటున్నారు. Also Read: టైటిల్ రేసులో ముగ్గురు.. విజేత మాత్రం అతడే..? బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కు ముందు జరిగిన సీజన్స్ కు మించి ప్రైజ్ మనీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. రూ. 50 లక్షల ప్రైజ్ మనీని బిగ్ బాస్ యాజమాన్యం ఇవ్వనుందని..వీటితో పాటు బిగ్ బాస్ షోకు స్పాన్సర్ గా వ్యవహరించిన ఓ జ్యూవెల్లరీ సంస్థ దాదాపు రూ. 20 లక్షల విలువైన డైమండ్ నక్లెస్ ను ఇవ్వబోతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, వీటితో పాటు రూ. 12 లక్షల విలువైన మారుతి బ్రిజా కారు కూడా గిఫ్ట్ గా దక్కబోతున్నట్లు తెలిసింది. ఇలా, ఓవరాల్ గా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కు దాదాపు రూ. 80 లక్షల వరకు ప్రైజ్ మనీ ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా..బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా కచ్చితంగా పల్లవి ప్రశాంత్ గెలుస్తాడని నెటిజన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అమర్ సెకండ్ లో ఉంటారని.. శివాజీ థర్డ్ ప్లేస్ అని, ఫోర్త్ ప్లేస్ ప్రియాంక అని.. అర్జున్ అంబటి ఐదుగురిలో ముందుగా ఎలిమినేట్ అవుతారని, ప్రిన్స్ యావర్ మాత్రం నాగార్జున ఇచ్చిన పదిహేను లక్షల సూట్ కేస్ తీసుకుని ఫైనల్ రేసు నుంచి తప్పుకోనున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రొమో ఎంతో ఆసక్తిని పెంచుతోంది. ఎపిసోడ్ లో రవితేజతో పాటు బబుల్ గమ్, డెవిల్, సైంధవ్ సినిమాల టీమ్ లు సందడి చేయబోతున్నాయి. స్టార్ యాంకర్ సుమ కూడా రానున్నారు. #bigg-boss-7 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి